Ambani School: ఆసియాలోనే సంపన్నుడు ముఖేష్ అంబానీ. అతని మనవడు పృథ్వీ అంబానీ. ఇప్పుడు మనవడికి ఆరేళ్ల వయసు. ఆ పిల్లాడు ఎక్కడ చదువుతున్నాడో తెలుసా? ఆ స్కూలు ఫీజు వివరాలు తెలుసుకోండి.
ఆసియాలోనే కుబేరుడైన ముకేశ్ అంబానీ, నీతా అంబానీలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ కొడుకు పృథ్వీ అంబానీ. పృథ్వీ అంబానీ వయసు ఇప్పుడు ఆరేళ్లు. పృథ్వీ అంబానీ ఏదో సాధారణ స్కూల్‌లో చదవడం లేదు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు.
23
ఏ స్కూల్ లో చదువుతున్నాడు?
పృథ్వీ అంబానీ ప్రస్తుతం తమ సొంత స్కూల్లోనే చదువుతున్నాడు.ఆ స్కూల్ పేరు 'నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్' . ఈ పాఠశాలకు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన కరికులమ్ సంస్థ 'ఇంటర్నేషనల్ బాకలారియేట్ వరల్డ్ స్కూల్' గుర్తింపు ఉంది. NMAJS స్కూల్‌లో పిల్లల ప్రాథమిక విద్య 'ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్' తో మొదలవుతుంది. ఆ తర్వాత 'మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్' కూడా ఇక్కడే అందిస్తారు. ఈ స్కూల్‌కు ముంబైలో రెండు భారీ, అత్యాధునిక క్యాంపస్‌లు ఉన్నాయి. ఒకటి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో, మరొకటి జియో వరల్డ్ సెంటర్ ప్రాంగణంలో ఉంది. ఈ రెండు స్కూళ్లలో బాలీవుడ్ హీరో హీరోయిన్ల పిల్లలు చదువుతున్నారు.
33
స్కూలు ఫీజు ఎంత?
ముఖేష్ అంబానీ మనవడి స్కూలు ఫీజు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్ తరగతిని బట్టి సుమారు రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. అంటే పృథ్వీ అంబానీ స్కూలు ఫీజు పద్నాలుగు లక్షలకుపైగానే ఉంటుంది. ఈ 'నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్', 'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్' (DAIS)లో ఒక భాగం. ఇండియాలోనే నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్‌గా ధీరూభాయ్ అంబానీ స్కూల్ పేరు సాధించింది.