Chicken: మన దేశంలో మాంసాహార ప్రియులు ఎక్కువైపోయారు. కొంత మంది మటన్ ఇష్టపడితే.. మరికొంత మంది చికెన్ ను చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. మరి ఈ రెండు కలిపి తింటే ఎలా ఉంటుందో తెలుసా? మటన్, చికెన్ ను కలిపి వండొచ్చా?
మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు కొరత లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే కొందరు వెరైటీ కోసం లేదా ఇంట్లో అందరి ఇష్టాల కోసం చికెన్ (కోడి మాంసం), మటన్ (మేక మాంసం) రెండింటినీ ఒకేరోజు తెచ్చుకుంటారు. కొందరైతే ఈ రెండింటినీ కలిపి ఒకే కూరగా వండే ప్రయోగాలు కూడా చేస్తుంటారు. మరి ఇలా చికెన్, మటన్ కలిపి వండడం లేదా ఒకేసారి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు దీనిపై ఏం చెబుతున్నారు.
26
చికెన్, మటన్ కలిపి వండవచ్చా?
సాంకేతిక కోణంలో చూస్తే చికెన్, మటన్ లను కలిపి వండడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రెండు రకాల మాంసాలు ఉడికే సమయం (Cooking time) పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చికెన్ చాలా త్వరగా, సులభంగా ఉడికిపోతుంది. కానీ మటన్ గట్టిగా ఉండడం వల్ల అది పూర్తిగా ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. రెండింటినీ కలిపి ఒకేసారి వండితే, మటన్ ఉడికేసరికి చికెన్ ముక్కలు పూర్తిగా మెత్తగా అయిపోయి, విడిపోయి గుజ్జులా మారిపోతాయి. ఒకవేళ చికెన్ ఉడికిన వెంటనే దించేస్తే మటన్ పచ్చిగా ఉండిపోతుంది. పచ్చి మాంసం తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
36
చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? జీర్ణక్రియపై ప్రభావం:
ఆరోగ్య పరంగా చూసుకుంటే చికెన్ అనేది 'వైట్ మీట్' (White Meat) కిందకు వస్తుంది, మటన్ 'రెడ్ మీట్' (Red Meat) కిందకు వస్తుంది. చికెన్ తేలికగా ఉండి త్వరగా జీర్ణమవుతుంది. కానీ మటన్‌లో కొవ్వు, ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటినీ ఒకేసారి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.అధిక క్యాలరీలు, ప్రొటీన్లు: రెండు రకాల మాంసాలను కలిపి తిన్నప్పుడు శరీరానికి ఒకేసారి భారీ మొత్తంలో ప్రొటీన్లు, కొవ్వు అందుతాయి. శరీరం ఒకేసారి ఇంత భారీ మోతాదులో పోషకాలను శోషించుకోలేదు. ఫలితంగా కాలేయం (Liver), మూత్రపిండాలపై (Kidneys) ఒత్తిడి పెరుగుతుంది.
ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏమంటారంటే?.. చికెన్, మటన్‌లను కలిపి వండకుండా, విడివిడిగా వండుకుని వేర్వేరు సమయాల్లో తినడం ఉత్తమం. ఉదాహరణకు మధ్యాహ్నం మటన్ తింటే, రాత్రికి చికెన్ తినడం లేదా ఒక రోజు చికెన్ తింటే, మరుసటి రోజు మటన్ తినడం మంచిది. ఏ మాంసమైనా అతిగా తింటే ప్రమాదకరమే. ముఖ్యంగా రెడ్ మీట్ (మటన్) వారానికి ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువ తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు.
56
ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు?
మన దేశంలో జనాలు మటన్ కంటే చికెన్‌ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) మరియు వివిధ నివేదికల ప్రకారం, భారతదేశంలో చికెన్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణాలు చికెన్ ధర తక్కువగా ఉండటం, సులభంగా లభించడం మరియు ఆరోగ్యపరంగా లీన్ ప్రొటీన్ (Lean Protein) కలిగి ఉండటమే. మటన్ (రెడ్ మీట్) ధరలు ఎక్కువగా ఉండటం మరియు అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో, జనాలు నిత్యం చికెన్ తినడానికే మొగ్గు చూపుతున్నారు.
66
అసలు విషయం ఏంటంటే?
చికెన్ మరియు మటన్ కలిపి తినడం వల్ల తక్షణమే ప్రాణాంతక సమస్యలు రాకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. అనేక రకాల ఆరోగ్య సంస్యలు రావచ్చు. కాబట్టి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం ఈ రెండు రకాల మాంసాలను విడివిడిగా, తగిన పరిమితిలో ఆస్వాదించడమే సురక్షితమైన మార్గం.