Government Schemes : మీ ఇంటి ఖర్చులు తగ్గించుకోవాలా? ఈ 5 ప్రభుత్వ పథకాలతో డబ్బులు సేవ్ చేసుకొండి

Published : Jul 13, 2026, 10:02 PM IST

రోజురోజుకీ పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్నారా? ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాలు అర్హులైన వారికి ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన 5 పథకాలు

ఇంటి ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ప్రజలకు నేరుగా ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. కరెంట్, వంటగ్యాస్, వైద్యం, సొంత ఇల్లు వంటి విషయాల్లో ఈ పథకాలు ఆదుకుంటాయి. ఇలాంటి టాప్ 5 పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం… వాటిద్వారా లభ్ది పొందుతూ కుటుంబ ఖర్చులు ఆదా చేసుకోవచ్చు.

27
పీఎం సూర్య ఘర్ యోజన
ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలు తమ ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల కరెంట్ బిల్లు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
37
పీఎం ఆవాస్ యోజన
సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఈ పథకం ఆర్థిక సాయం అందిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారికి వేర్వేరుగా నిబంధనలు ఉంటాయి.
47
ఆయుష్మాన్ భారత్
ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలు, గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఏటా నిర్ణీత మొత్తం వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. అర్హత, ఆసుపత్రుల జాబితా వంటి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి.
57
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన
పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన వారికి గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి ఆర్థిక సాయం కూడా అందిస్తారు.
67
పీఎం జన్ ధన్ యోజన
ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతా తెరవొచ్చు. రూపే డెబిట్ కార్డుతో పాటు కొన్ని ఆర్థిక భద్రతా ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
77
దరఖాస్తు చేసే ముందు గమనించాల్సినవి

ప్రతి పథకానికి వేర్వేరు అర్హతలు, కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు సంబంధిత పథకం అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గర్లోని ప్రభుత్వ సేవా కేంద్రంలో వివరాలు తెలుసుకోవడం మంచిది. అర్హులైన వారు ఈ పథకాలతో కుటుంబ ఖర్చులను కొంతమేర తగ్గించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories