Motivational story: మీరు కూడా కోపంతో ఊగిపోతారా? ఈ మేకుల క‌థ చ‌దివితే మారాల్సిందే

Published : May 22, 2025, 08:45 PM ISTUpdated : May 22, 2025, 08:51 PM IST

కోపం స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఎమోష‌న్‌. అయితే కోపం ఎక్కువైతే మ‌న‌ల్నే ద‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాంటి కోపాన్ని ఎలా త‌గ్గించుకోవాలి.? ఒక నీతి క‌థ‌తో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
14
కోపిష్టి పిల్లాడు:

అన‌గ‌న‌గా ఒక ఊరిలో రామ‌య్య అనే రైతుకు రమేశ్ అనే కొడుకు ఉండేవాడు. రమేశ్ మంచివాడు, కానీ అతడికి ఓ చిన్న లోపం ఉంది. అతడు చాలా కోపిష్టి. చిన్నచిన్న విషయాలకు కూడా చిర్రెత్తిపోయేవాడు. కానీ కోపం చల్లారిన తర్వాత వెంటనే క్షమాపణ అడిగే మంచి మనసున్న వాడు.

రోజూ స్కూల్లో, ఇంట్లో ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండడంతో, అతని తండ్రి రంగయ్య ఒకరోజు గట్టిగా మందలించాడు. త‌న కొడుకు కోపాన్ని త‌గ్గించ‌డానికి అత‌ను ఒక ప్లాన్ మంచి ప్లాన్ వేశాడు.

24
కోపాన్ని త‌గ్గించే చిట్కా.

కోపంతో ఊగిపోయే కొడుకు కోపాన్ని త‌గ్గించేందుకు తండ్రి ఒక ఉపాయం చేశాడు. "రమేశ్! నీవు కోపపడిన ప్రతిసారీ, పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు," అని సూచించాడు. రమేశ్ తన నాన్న మాట విని, ఆ మరుసటి రోజు నుంచే అలా చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లో తలుపంతా మేకులతో నిండిపోయింది. అవి చూసి తలుపు చూడటానికి అసహ్యంగా మారిపోయింది.

34
మారిన ర‌మేశ్ ఆలోచ‌న‌:

ఒక రోజు రామ‌య్య‌ రమేశ్‌ను పిలిచి తలుపు చూపించాడు. "ఇవి చూడూ! మేకులతో తలుపు ఎంత అంద విహీనంగా మారిందో. నువ్వు కోప్పడినప్పుడు, ఎదుటివాళ్ల మనసులో కూడా ఇలాగే ఓ మచ్చ పడుతుంది," అని అన్నాడు. అప్పుడు రమేశ్ సిగ్గుపడి, "నాన్నా, ఇక నేను మారిపోతాను. ఎవ‌రితో కోప్ప‌డ‌ను అని చెప్తాడు.

రామ‌య్య‌ చిరునవ్వుతో, "ఇది చాలా మంచిది! నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకున్న ప్రతిసారీ ఒక మేకును తీసేస్తూ ఉండు," అని చెప్పాడు. రోజులు గడిచాయి… రమేశ్ ఓర్పుగా ఉండటం ప్రారంభించాడు. ఒక్కో మేకును తీయడం ప్రారంభించాడు. కానీ, ప్రతి మేకు తీసిన చోటా ఓ చిన్నచిన్న చిల్లు మిగిలిపోయింది.

44
గొప్ప నీతి:

ఇలా ప్ర‌తీ రోజూ మేకును తొల‌గించిన త‌ర్వాత త‌లుపుపై మ‌చ్చ మాత్రం అలాగే ఉండి పోతుంది. దీనిని చూపిస్తూ "నీవు కోపంగా మాట్లాడినప్పుడు, ఎదుటివాళ్ల మనసులో మేకు కొట్టినట్టే. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా, మేకు తీసినట్టు అవుతుంది. కానీ ఆ మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అందుకే ఎప్పుడూ మాట్లాడే ముందు ఆలోచించు. ఎవరినీ అనవసరంగా బాధపెట్టకూడదు. అని చెప్తాడు.

Read more Photos on
click me!

Recommended Stories