ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణం సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యం కల్పించారు. సికింద్రాబాద్‌తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, ధర్మాబాద్, ముద్ఖేడ్ జంక్షన్, నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు. రైలు ప్రయాణంతో పాటు రాత్రి బస, వాష్ అండ్ ఛేంజ్, రవాణా సౌకర్యం వంటి సేవలు ప్యాకేజీ కేటగిరీని బట్టి అందిస్తారు.
ఎకానమీ (స్లీపర్) ప్యాకేజీకి నాన్-ఏసీ వసతి, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీలకు ఏసీ వసతి కల్పిస్తారు. యాత్రలో భాగంగా ప్రయాణికులకు శాఖాహార భోజనం (ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) ప్రీ-సెట్ మెనూ ప్రకారం అందిస్తారు.