ప్రపంచాన్ని వణికించే భయంకర ప్రకృతి విలయం సునామీ. ఒక వేళ బంగాళాఖాతంలో సునామీ వస్తే ఇండియాలో తీర ప్రాంతాల్లో ఉన్న ఏ నగరానికి ఎక్కువ ప్రమాదమో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశానికి సునామీ ముప్పు ప్రధానంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి పొంచి ఉంది. అయితే సముద్రపు అడుగుభాగంలోని భూగర్భ పలకల కదలికలు, తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, జనసాంద్రత, సముద్ర మట్టానికి ఉన్న ఎత్తు ఆధారంగా దేశంలోని ఇతర నగరాల కంటే చెన్నై నగరానికి సునామీ వల్ల అత్యధిక ప్రమాదం పొంచి ఉందని భౌగోళిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
25
చెన్నైపై సుమత్రా-అండమాన్ ప్రభావం
బంగాళాఖాతంలోని సుమత్రా-అండమాన్ (Subduction Zone) వద్ద భారీ భూకంపాలు సంభవించినప్పుడు పుట్టే సునామీ అలలు తూర్పు నుండి పడమర వైపుకు అంటే నేరుగా తమిళనాడు తీరం వైపు దూసుకొస్తాయి. 2004లో సంభవించిన పెను సునామీ సమయంలో కూడా చెన్నై, నాగపట్నం, కడలూరు వంటి తమిళనాడు తీర ప్రాంతాలే అత్యధికంగా నష్టపోవడం దీనికి నిదర్శనం.
35
సముద్రపు లోతు, చెన్నై భౌగోళిక బలహీనతలు
చెన్నై తీరం వద్ద సముద్రపు అడుగుభాగం (Continental Shelf) చాలా వెడల్పుగా, ఏటవాలుగా ఉండటం వల్ల లోతైన సముద్రంలో వేగంగా వచ్చే అలలు తీరానికి తగలగానే ఒక్కసారిగా చాలా ఎత్తుకు ఎగసిపడతాయి. దీనికి తోడు చెన్నై నగరం సముద్ర మట్టానికి సగటున కేవలం 6.7 మీటర్ల ఎత్తులో ఉండటం, సముద్రానికి అతి సమీపంలోనే కోటికి పైగా జనాభా ఉన్నారు. దీనికి తోడు మెరీనా బీచ్, ఐటీ కారిడార్లు, కల్పక్కం అణువిద్యుత్ కేంద్రం ఉండటం ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోంది.
బంగాళాఖాతం తీరంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం కూడా సునామీ హై-రిస్క్ జోన్‌లోనే ఉన్నప్పటికీ, చెన్నైతో పోలిస్తే దీనికి కొంత సహజ రక్షణ ఉంది. ఇక్కడి తీరాన్ని సునామీ అలలు నేరుగా కాకుండా కొంచెం ఏటవాలుగా (Angled) తాకడం, అలాగే నగరం చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, ప్రత్యేక భౌగోళిక ఆకృతి అలల ఉధృతిని కొంతవరకు నియంత్రిస్తాయి.
55
కోల్‌కతా నగరాన్ని కాపాడుతున్న సుందర్బన్స్ అడవులు
మరో ప్రధాన నగరమైన కోల్‌కతా సముద్ర తీరానికి సుమారు 100 కిలోమీటర్ల లోపలికి హుగ్లీ నది ఒడ్డున ఉండటం ఒక పెద్ద సానుకూలాంశం. అంతేకాకుండా సముద్రానికి, నగరానికి మధ్యలో విస్తరించి ఉన్న ప్రపంచ ప్రఖ్యాత సుందర్బన్స్ (Sundarbans) మడ అడవులు ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తూ సునామీ అలల వేగాన్ని, తీవ్రతను కోల్‌కతా చేరేసరికి బాగా తగ్గించివేస్తాయి.