ట్రైన్ లో వస్తువులు పోగొట్టుకున్న ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే తీసుకొచ్చిన అద్భుతమైన ప్లాట్‌ఫారమ్ ‘రైల్ మదద్’ (Rail Madad). ఇది 24x7 అందుబాటులో ఉండే ఒక సెంట్రలైజ్డ్ గ్రీవెన్స్ సిస్టమ్.
• ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి 'Rail Madad' యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
• మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయ్యాక, లాగిన్ అవ్వండి.
• అక్కడ ‘Grievance’ ఆప్షన్ లోకి వెళ్లి, మీ టికెట్ పై ఉన్న PNR నంబర్‌ను ఎంటర్ చేయాలి.
• మీరు పోగొట్టుకున్న వస్తువు వివరాలు అంటే బ్యాగ్ కలర్, సైజ్, లోపల ఏమున్నాయి, మీ కోచ్, సీట్ నెంబర్ వంటివి క్లియర్ గా రాయండి. వీలైతే ఆ లగేజ్ ఫోటో అప్‌లోడ్ చేయండి.
• సబ్మిట్ చేయగానే మీకు ఒక ‘గ్రీవెన్స్ ఐడీ’ వస్తుంది. దీనితో మీ కంప్లైంట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో లైవ్ లో ట్రాక్ చేయవచ్చు.