Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?

Published : May 20, 2026, 06:30 PM IST

Watermelon: వేసవిలో దొరికే పండు పుచ్చకాయ. తొంబై శాతం నీటితో ఉండే ఈ పండు మనదేశంలో ఒక నగరంలో ఎక్కువగా పండుతుంది. దాన్నే ఇండియాస్ వాటర్ మెలన్ క్యాపిటల్ అని పిలుచుకుంటారు. ఆ ఊరి పేరు సోలాపూర్. 

PREV
14
పుచ్చకాయల రాజధాని ఇదే

వేసవిలో పండే సీజనల్ ఫ్రూట్లలో పుచ్చకాయ ఒకటి. వాటర్ మెలన్ తింటే చాలు.. ఎంతటి దాహమైనా తీరిపోతుంది. తొంభై శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే మన దేశంలో పుచ్చకాయల రాజధానిగా ఒక నగరం పేరు పొందింది. అది మహారాష్ట్రలోని సోలాపూర్. ఈ నగరం నుంచి అనేక రాష్ట్రాలకు భారీగా పుచ్చకాయలు సరఫరా అవుతాయి. రహదారుల పక్కన కనిపించే పెద్ద పెద్ద పుచ్చకాయ పొలాలు ఈ నగరానికి ఎంతో అందాన్నిస్తాయి. ఎండలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో నల్ల మట్టి, సాగునీటి సౌకర్యం కలిసి వచ్చి ఇక్కడ పుచ్చకాయలు ప్రత్యేకమైన రుచితో పండుతున్నాయి. అందుకే సోలాపూర్ పుచ్చకాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

24
ఈ రకాలకు డిమాండ్

సోలాపూర్ లో పండించే పుచ్చకాయల్లో కిరణ్, షుగర్ కింగ్, సీడ్ లెస్ వాటర్ మిలన్, ఫోర్స్9 వంటి రకాలకు ఎంతో ఆదరణ ఉంది. సీడ్ లెస్ పుచ్చకాయలను పట్టణాల్లో ఎక్కువమంది తింటూ ఉంటారు. రైతులు అతి తక్కువ కాలంలోనే ఈ పంటలను పండించి మంచి దిగుబడి తెచ్చుకుంటున్నారు. భీమా నది పరివాహక ప్రాంతం, ఉజ్జయిని డ్యామ్ నుంచి లభించే నీరు పుచ్చకాయల సాగుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి వేసవిలో ప్రజలు దీన్ని అధికంగా తినేందుకు ఇష్టపడతారు. ఇక్కడ పుచ్చకాయ మార్కెట్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి.

34
సోలాపూర్ రోజువారీ ఆహారం ఈ పండే

సోలాపూర్ లో పుచ్చకాయలే కాదు.. వస్త్ర పరిశ్రమ కూడా అద్భుతంగా సాగుతోంది. ఒకప్పుడు సోలాపూర్ ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు. మొక్కజొన్న, చెరుకు, పత్తి వంటి పంటలు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. ఈ నగరం పూణే, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు రోడ్డు, రైలు మార్గాల్లో బాగా అనుసంధానమై ఉంది. అందుకే ఈ ఉత్పత్తుల సులభంగా నగరాలకు చేరుకుంటాయి. వేసవిలో సోలాపూర్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతాయి. అయినా కూడా ఇదే వేడిలో పుచ్చకాయలు సహజమైన తీపితో పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇక్కడ ప్రజలు పుచ్చకాయను కేవలం పండుగా కాదు ప్రతిరోజు తినే ఆహారంగా చూస్తారు.

44
పుచ్చకాయల పంటలను చూసేందుకు..

ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సోలాపూర్ గురించి చర్చ మొదలైపోయింది. అక్కడ ఉండే ప్రశాంత వాతావరణం, తక్కువగా ఉండే ట్రాఫిక్ రద్దీ, రుచికరమైన ఆహారం ఎంతోమందికి నచ్చుతుంది. ముఖ్యంగా వ్యవసాయ టూరిజాన్ని ఇష్టపడేవారు సోలాపూర్ చూసేందుకు వెళ్తున్నారు. పుచ్చకాయల పొలాలు చూడడానికి ప్రత్యేకంగా వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వాతావరణంలోని మార్పులు నీటి సమస్యలు ఉన్నప్పటికీ పుచ్చకాయల పంట మాత్రం తమకు మంచి ఆదాయాన్ని ఇస్తుందని రైతులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories