Western Toilet: ఈరోజుల్లో చాలా మంది టాయిలెట్‍లో ఫోన్ వాడటం, పేపర్స్, బుక్స్ చదవడం అలవాటైపోయింది. దీనివల్ల గంటల తరబడి అందులోనే గడిపేస్తుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి అని. ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?
ఇండియన్ స్టైల్ టాయిలెట్‍లో ఎక్కువ సేపు ఉండలేరు. ఎందుకంటే అక్కడ కూర్చువడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేశాయి. ఓ ఫోన్ తీసుకెళ్లి గంటలకొద్దీ కూర్చుంటారు. అక్కడ సమయం గడిపేస్తుంటారు. కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలను పట్టించుకోరు. ఎప్పుడైనా ఆలోచించారా? టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి అని. ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?
24
టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి
దీనిపై వైద్యులు ఏం చెప్తున్నారంటే...టాయిలెట్ సీటుపై 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం కూర్యోకూడదు. సాధారణంగా మోషన్ కావడానికి అంతకంటే ఏం పట్టదు. ఒకవేళ మీకు మోషన రాకపోతే వచ్చేయండి. బలవంతంగా మాత్రం ముక్కకండి. లేకపోతే మలవిసర్జన ద్వారం చిట్లీ రక్తం వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల కూర్చోలేకపోవడం, విపరీతమైన నొప్పి వస్తుంది.
34
ముక్కకండింొంొ
టాయిలెట్ సీటు డిజైన్ సాధారణ కమోడ్ కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. మధ్యలో ఖాళీ వల్ల ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు శరీరంపై పడే ప్రెజర్ వేరేలా ఉంటుంది. దీనివల్ల అవి వాచి రక్తం కారడం లేదా పైల్స్ సమస్యకు దారి తీస్తుంది.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పెల్విక్ కండరాలు బలహీనపడి, మలద్వారం గుండా రెక్టమ్ కొద్దిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు కూర్చుంటే పేగుల సహజ కదలికలు దెబ్బతిని, మలబద్ధకం తీవ్రమవుతుంది. టాయిలెట్లలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఫోన్లు వాడటం వల్ల ఆ బ్యాక్టీరియా ఫోన్ కు అంటుకుని ఆ తర్వాత మన చేతుల ద్వారా శరీరంలోకి చేరి ఇన్ ఫెక్షన్లకు కారణమవుతుంది.
ఒక వేళ మీకు 5-10 నిమిషాలైనా మోషన్ రాకపోతే మీ డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల ఫ్రీగా అయిపోతుంది. వెస్ట్రన్ కమోడ్ వాడేవారు కాళ్ల కింద ఒక చిన్న స్టూల్ పెట్టుకోవడం వల్ల పేగులు నేరుగా మారి ఒత్తిడి లేకుండా మోషన్ సులభంగా అవుతుంది. ప్రతిరోజూ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది.