Chess Village: ఒకప్పుడు ఊరంతా తాగుబోతులే.. కట్ చేస్తే, ఇంటికో చెస్ ఛాంపియన్ తయారయ్యాడు..!

Published : Jul 13, 2026, 02:51 PM IST

Chess Village: ఒకప్పుడు తాగుబోతులతో... కుటుంబాన్ని కనీసం పట్టించుకోని వ్యక్తులతో నిండి ఉన్న ఓ గ్రామం..ఇప్పుడు చెస్ కి నిలయంగా మారింది. ఇంటికో చెస్ ఛాంపియన్ ఉన్నాడు. ఆ గ్రామాన్ని అలా మర్చిన వ్యక్తి ఎవరు..?

PREV
13
చెస్ గ్రామం...

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పక్కన వాడు ఏమైపోతున్నాడనే ఆలోచన కూడా లేకుండా.. ఫోన్ లో మునిగిపోయి సమయం గడుపుతున్న రోజులు ఇవి. కానీ, ఇలాంటి రోజుల్లో కూడా ఒక గ్రామంలోని ప్రజలు.. ఫోన్ కి కాకుండా... చెస్ ఆట మీద ఫోకస్ పెడుతున్నారు. ఎంతలా అంటే.. ఆ గ్రామంలో మీరు ఎక్కడ చూసినా.. చెస్ ఆడుతూనే కనిపిస్తారు. ఇద్దరు సీరియస్ గా చెస్ ఆడుతుంటే.. మరి కొందరు.. తమ చేతిలో ఫోన్లు కూడా పక్కన పెట్టేసి.. ఆ ఆటని అంతే సీరియస్ గా చూస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక చెస్ ఛాంపియన్ ఉన్నాడు. అదే కేరళలోని త్రిస్సూర్ జిల్లా మారోట్టిచల్.

ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంలో ఒకప్పుడు మొత్తం తాగుబోతులే ఉండేవారు అంటే నమ్ముతారా? కుటుంబాన్ని, పిల్లల్ని పట్టించుకోకుండా.. నిత్యం మద్యంలో మునిగితేలేవారు. అలాంటివారిని ఓ వ్యక్తి పూర్తిగా మార్చేశాడు. వారికి చెస్ ని పరిచయం చేసి.. వారి తలరాతను మార్చేశాడు. ఈ గ్రామం పూర్తి వివరాల్లోకి వెళితే...

23
ఒకప్పుడు ఈ గ్రామం ఎలా ఉండేందంటే...

సుమారు 40 ఏళ్ల క్రితం ఈ మారోట్టిచల్ గ్రామం మొత్తం మద్యపానం, జూదానికి బానిసైపోయింది. చాలా మంది కుటుంబాల జీవితాలు కూడా వీటి కారణంగా రోడ్డున పడ్డాయి. అంతేకాదు.. 1970ల్లో ఈ గ్రామంలోని ప్రజలు తమ వ్యక్తిగత వినియోగం కోసం.. మద్యం తయారుచేసేవారు. ఇక 1980లు వచ్చేసరికి.. ఈ గ్రామంలో అక్రమంగా మద్యం ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామ ప్రజలు మద్యం తాగడమే కాకుండా, ప్రతి రోజూ తమ ఇళ్ల్లోనూ మద్యం తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తర్వాత కుటుంబాన్ని, పంటలను వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు.ఇక.. మద్యం అమ్మగా వచ్చిన డబ్బును పేకాట ఆడి పోగొట్టడం మొదలుపెట్టారు. దీంతో.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఆకలితో అలమటించం మొదలుపెట్టారు.

33
గ్రామాన్ని మార్చిన ఉన్ని కృష్ణన్...

1980 చివరలో..ప్రవాసి చరాలియిల్ ఉన్ని కృష్ణన్ అనే వ్యక్తి ఈ గ్రామంలో అడుగుపెట్టాడు. అయితే.. గ్రామం మొత్తం మద్యానికి బానిసగా మారడం అతన్ని కలచివేసింది. అంతే.. గ్రామాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు. మద్యానికి బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోని వ్యక్తులు ఫ్యామిలీలను కలిశాడు. వారి భార్య, పిల్లలతో కలిసి మాట్లాడటం మొదలుపెట్టాడు. వారి అందరి సహాయంతో.. మద్యం తయారు చేస్తున్న ప్రదేశాలపై దాడులు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత అందరికీ నెమ్మదిగా చెస్ ఆటపై ఇష్టం పెరిగేలా చేశాడు. తనకు వచ్చిన ఈ ఆటను అందరికీ నేర్పించడం మొదలుపెట్టాడు. అతని సంకల్ప బలం కారణంగా.. ఈ ఆటపై గ్రామంలోని ప్రజలకు ఆసక్తి మొదలైంది. మద్యం కోసం కాకుండా.. ఈ ఆట గురించి మాట్లాడుకోవడం కోసం కలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు.. ఈ గ్రామ తలరాతే మారిపోయింది. ప్రతి ఇంటి నుంచి ఒక చెస్ ఛాంపియన్ తయారు అవుతున్నారు. ఉన్ని కృష్ణన్ ఆ సమయంలో దాదాపు వెయ్యి మందికి చెస్ నేర్పించారు. అది ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నేర్పించడం మొదలుపెట్టారు.

ఈ గ్రామానికి చెందిన క్రీడాకారుడు గౌరీ శంకర్ జయరాజ్ కి మంచి గుర్తింపు పొందాడు. 2025లో మన దేశంలోని టాప్ 600 యాక్టివ్ చెస్ ప్లేయర్ లలో ఒకరుగా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. ఈ గ్రామంలోని పిల్లలు.. కళ్లకు గంతలు కట్టుకొని కూడా చెస్ ఆడగలరు.

Read more Photos on
click me!

Recommended Stories