Most Secret Places in World : ప్రపంచంలోని అత్యంత రహస్య, కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. ఇక్కడికి వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.
మన ప్రపంచంలో సామాన్య ప్రజలు అస్సలు అడుగు పెట్టలేని కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయి. కేవలం భద్రతా కారణాల వల్ల మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ భద్రత, రక్షణ వ్యవస్థలు, అత్యంత కీలకమైన సమాచారం ఇక్కడే దాగి ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాలను ప్రపంచ దేశాలు ఎంతో రహస్యంగా ఉంచుతాయి. ఇక్కడ 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడే సైనిక బలగాలు, అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఆ నిగూఢమైన ప్రదేశాలు ఏంటో, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
28
1. ఏరియా 51
అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న 'ఏరియా 51' ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రత్యేక రకమైన యుద్ధ విమానాలు, అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతుంటాయని ప్రచారంలో ఉంది. అంతేకాదు, ఏలియన్స్ గురించిన రహస్యాలు కూడా ఇక్కడే ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. ఈ ప్రాంతాన్ని సాయుధ సైనికులు, డ్రోన్లు, శాటిలైట్ నిఘా వ్యవస్థలు 24 గంటలూ పహారా కాస్తుంటాయి. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ఈ ప్రాంతం వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తే, వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.
38
2. షాంఘై స్మార్ట్ గ్రిడ్
చైనాలో ఉన్న అత్యంత ఆధునిక విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ ఈ 'షాంఘై స్మార్ట్ గ్రిడ్'. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా సాంకేతికతలతో పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో లక్షలాది సిసిటివి కెమెరాలు నిరంతరం నిఘా ఉంచుతాయి. ఇక్కడ జరిగే ప్రతి చిన్న కదలికను కంట్రోల్ రూమ్ రికార్డ్ చేస్తుంది. ఈ వ్యవస్థలో చిన్న పొరపాటు జరిగినా చైనా ఆర్థిక వ్యవస్థపై, భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే దీనికి అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
అమెరికాలోని అత్యంత కీలకమైన అణు రక్షణ కేంద్రాలలో 'షైన్ మౌంటెన్ కాంప్లెక్స్' ఒకటి. ఎలాంటి అణు దాడులు జరిగినా సరే తట్టుకుని నిలబడేలా దీనిని భూగర్భంలో నిర్మించారు. ఈ కేంద్రం ప్రధాన గేట్ల బరువు దాదాపు 25 టన్నులు ఉంటుంది. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినా సరే, లోపల ఉన్నవారు సురక్షితంగా ఉండేలా దీని నిర్మాణం జరిగింది. అనుమతి లేకుండా ఇక్కడికి ప్రవేశించడం అసాధ్యం.
58
4. వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్, కొరియన్ డీమిలిటరైజ్డ్ జోన్
వాటికన్ సిటీలో ఉన్న 'వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్' ప్రపంచంలోనే అత్యంత రహస్య పత్రాలు దాగి ఉన్న ప్రదేశం. ఇక్కడ శతాబ్దాల నాటి పురాతన మతపరమైన పత్రాలు, చారిత్రక ఆధారాలను అత్యంత భద్రంగా ఉంచారు. ఇక్కడికి కేవలం కొద్దిమంది ఉన్నతాధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. లోపల జరిగే ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ చూస్తూనే ఉంటుంది.
68
కొరియన్ సైనికరహిత ప్రాంతం
అలాగే, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని 'కొరియన్ సైనిక రహిత ప్రాంతం' అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తత కూడిన ప్రాంతం. ఇరు దేశాల సైన్యాలు భారీగా ఇక్కడ మోహరించి ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో 24 గంటలూ నిఘా కొనసాగుతుంది.
78
5. గూగుల్ డేటా సెంటర్, స్వాల్‌బార్డ్ సీడ్ వాల్ట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ సమాచారాన్ని భద్రపరిచే కేంద్రాలలో గూగుల్‌కు చెందిన ది డల్లాస్ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ బయోమెట్రిక్ లాక్‌లు, మోషన్ సెన్సార్లు, హైఎండ్ కెమెరాలతో కూడిన గట్టి భద్రత ఉంటుంది. ఇక్కడికి నేరుగా వెళ్లే అనుమతి కొద్దిమంది ఐటీ నిపుణులకు మాత్రమే ఉంటుంది.
88
స్వాల్‌బార్డ్ సీడ్ వాల్ట్
ఇక నార్వేలో ఉన్న 'స్వాల్‌బార్డ్ సీడ్ వాల్ట్'ను ప్రపంచ విత్తన బ్యాంకు అని పిలుస్తారు. భవిష్యత్తులో భూమిపై ఏదైనా భారీ ప్రకృతి విపత్తులు లేదా ప్రపంచ యుద్ధాలు వచ్చి పంటలు నాశనమైతే, మళ్లీ జీవాన్ని పునరుద్ధరించడానికి ప్రపంచంలోని అన్ని రకాల ముఖ్యమైన విత్తనాలను ఇక్కడ దాచారు. భూగర్భంలో నిర్మించిన ఈ కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పనిచేస్తుంది.