ట్రావెలింగ్ అలసటతో హోటల్ రూమ్ కి వెళ్లగానే నేరుగా బెడ్‌పై వాలిపోవద్దు. ఇలాంటిచోట మీ భద్రత చాలా ముఖ్యం. అందుకే రూమ్‌లోకి వెళ్లాక, మీ సేఫ్టీ కోసం కొన్ని విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి.
టూర్ అయినా, ఆఫీస్ పని అయినా... వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు హోటల్‌లో ఉండటం తప్పనిసరి. రూమ్‌లోకి అడుగుపెట్టగానే చాలామంది అక్కడి లగ్జరీ సౌకర్యాలు, కిటికీ నుంచి కనిపించే వ్యూ చూసి మురిసిపోతారు. కానీ ఈ రోజుల్లో మన భద్రత, ప్రైవసీ చాలా ముఖ్యం. అందుకే, రూమ్ సర్వీస్‌కు ఆర్డర్ ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.
25
డోర్, కిటికీలు పరిశీలించండి..
గదిలోకి వెళ్లిన వెంటనే ముందుగా తలుపు వేసి దాని డెడ్‌బోల్ట్ లాక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి. డోర్‌కు ఉండే చిన్న రంధ్రం (పీప్‌హోల్) కూడా పరిశీలించండి. అది పగిలిపోయినా లేదా దానిలో కాగితం లాంటివి పెట్టినా వెంటనే రిసెప్షన్‌కు కంప్లైంట్ చేయండి.
ప్రధాన ద్వారం ఎంత ముఖ్యమో, కిటికీల భద్రత కూడా అంతే ముఖ్యం. బాల్కనీ డోర్ లోపలి నుంచి సరిగ్గా లాక్ అవుతుందో లేదో చెక్ చేయండి. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో బస చేస్తుంటే ఇది చాలా అవసరం.
35
రహస్య కెమెరాలున్నాయేమో చూడండి..
ఈ మధ్య కాలంలో హోటల్ గదుల్లో రహస్య కెమెరాల బెడద ఎక్కువైంది. టీవీ సెట్-టాప్ బాక్స్, స్మోక్ డిటెక్టర్, ఏసీ వెంట్స్, గోడ గడియారం, అద్దాలు వంటి గదిలోని వస్తువుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చుతున్నారు… కాబట్టి గదిలోకి వెళ్లగానే వస్తువులను జాగ్రత్తగా గమనించండి. స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్ వేసి మూలల్లో చెక్ చేయండి. కెమెరా ఉంటే దాని లెన్స్ మెరుస్తుంది.
ఇది కొంచెం అతిగా అనిపించినా భద్రత కోసం అవసరం. గదిలోకి వెళ్లగానే బాత్రూమ్, అలమరా లోపల, కర్టెన్ల వెనుక, మంచం కింద ఎవరైనా దాక్కున్నారేమో లేదా ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ఒకసారి చూడండి.
అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవచ్చు. అందుకే గదిలోని ఫోన్ పనిచేస్తుందో లేదో చెక్ చేయండి. రిసెప్షన్ నంబర్‌కు డయల్ చేసి, వాయిస్ సరిగ్గా వినిపిస్తుందో లేదో నిర్ధారించుకోండి.
55
విలువైన వస్తువులు జాగ్రత్త...
మీ విలువైన వస్తువులు పెట్టుకోవడానికి గదిలో సేఫ్ బాక్స్ ఉంటుంది. అది సరిగ్గా లాక్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ అది ముందే లాక్ చేసి ఉన్నా లేదా సరిగా పనిచేయకపోయినా వెంటనే సిబ్బందితో దాన్ని రీసెట్ చేయించుకోండి.
ప్రతి హోటల్ గది తలుపు వెనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ ఉంటుంది. అగ్నిప్రమాదం లాంటివి జరిగితే గది నుంచి బయటకు వెళ్లే దగ్గరి దారి ఏదో ముందుగానే తెలుసుకోండి.
తెగిపోయిన కరెంట్ వైర్లు లేదా పగిలిపోయిన సాకెట్లు ప్రమాదకరం. బాత్రూమ్‌లోని గీజర్ లేదా హెయిర్ డ్రైయర్ దగ్గర వైర్లు బయటకు వచ్చాయేమో చూడండి. ఏమాత్రం ప్రమాదకరంగా అనిపించినా వెంటనే రూమ్ మార్చమని అడగండి.