అసలు కారణం ఇదే...
లిఫ్ట్ ని దాదాపు ఉక్కు లేదా ఐరన్ తో తయారు చేస్తారు. సైంటిఫికల్ గా చెప్పాలంటే.. లిఫ్ట్ ఒక ఫారడే కేజ్ లా పని చేస్తుంది. అంటే...ఈ లోహపు గోడలు మొబైల్ సిగ్నల్స్‌ను అడ్డుకుంటాయి. లోహంతో కప్పబడి ఉన్న చోటికి విద్యుదయస్కాంత తరంగాలు (mobile signals) సులభంగా లోపలికి రావు, బయటకు వెళ్లవు.మొబైల్ సిగ్నల్స్ బయట ఉన్న టవర్ల నుండి వస్తాయి.
కానీ లిఫ్ట్ లో ఉన్నప్పుడు...లోహపు గోడలు సిగ్నల్స్‌ను వెనక్కి తిప్పేస్తాయి.మందపాటి గోడలను సిగ్నల్స్ దాటలేవు
ఎలివేటర్ భవనం మధ్యలో ఉండటం వల్ల సిగ్నల్ ఇంకా బలహీనంగా మారుతుంది
మరో, ముఖ్య కారణం ఏమిటంటే, ఎలివేటర్ ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. పైకి, కిందకి వేగంగా కదిలేటప్పుడు మీ ఫోన్ సమీప టవర్‌తో కనెక్ట్ అవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. అందుకే కాల్స్ కట్ అవుతాయి. ఇంటర్నెట్ కూడా రాదు.