90s Biscuits: బిస్కెట్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. ప్రజెంట్ మార్కెట్ లో వందల రకాల బిస్కెట్స్ అందుబాటుల్ ఉన్నాయి. కానీ ఒకప్పుడు కొన్ని బ్రాండ్స్ కు బాగా డిమాండ్ ఉండేది. ముఖ్యంగా 90s కిడ్స్ ఇష్టంగా తిన్న బిస్కెట్స్ గురించి మీకు తెలుసా?
ఇప్పుడంటే వందల వేల రకాల బిస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి కానీ.. ఒకప్పుడు కొన్ని ఫేమస్ బ్రాండ్స్ బిస్కెట్స్ మాత్రమే అందుబాటుల ఉండేవి. ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో చిన్ననాటి సాయంత్రాలు, టీ సమయాలు ఎంతో ప్రశాంతంగా గడిచేవి. ఆ టైమ్ లో ఇంట్లో చేసిన పిండివంటలతో పాటు.. బయట నుంచి తెచ్చుకున్న 'బిస్కెట్లు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. ముఖ్యంగా టీలో ముంచుకుని తినడానికే కాకుండా, స్నేహితులతో పంచుకోవడానికి, ఆడుకుంటూ తినడానికి బిస్కెట్లు ఎంతో ఉపయోగపడేవి. అందులో 90s కిడ్స్ ఎప్పటికీ మరచిపోలేని కొన్ని బిస్కెట్ బ్రాండ్స్ ఉన్నాయి. అవి ఏంటి? వాటిని ఎందుకు అంత ఇష్టపడేవారు.
24
పార్లే-జీ (Parle-G)
ఇండియన్ బిస్కెట్స్ బ్రాండ్స్ హిస్టరీలో 'పార్లే-జీ' ది చాలా ప్రత్యేక స్థానం. 1929లో ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో మోహన్‌లాల్ దయాల్ ప్రసాద్ ఈ సంస్థను స్థాపించారు. ప్రారంభంలో 1939లో 'పార్లే గ్లూకో' పేరుతో బిస్కెట్ ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. 1980వ దశకంలో దీని పేరును 'పార్లే-జీ'గా మార్చారు. ఇక్కడ 'జీ' అంటే మొదట్లో 'గ్లూకోజ్' అని అర్థం కాగా, తర్వాత కాలంలో ప్రకటనల ద్వారా 'జీ ఫర్ జీనియస్'గా ప్రచారం చేశారు. సాధారణ గ్లూకోజ్ రుచి, ఎరుపు-పసుపు రంగుల ప్యాకింగ్, ప్యాకెట్ పై ఉండే చిన్నపాటి పాప బొమ్మ ఈ బిస్కెట్ ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్లలో పార్లే-జీ ఒకటిగా నిలిచింది.
బ్రిటానియా లిటిల్ హార్ట్స్ (Britannia Little Hearts)
1993లో బ్రిటానియా కంపెనీ భారతీయ మార్కెట్లోకి పరిచయం చేసిన వినూత్న ఉత్పత్తి 'లిటిల్ హార్ట్స్'. ఆ కాలంలో బిస్కెట్లు సాధారణంగా చతురస్రాకారంలో లేదా గుండ్రంగా ఉండేవి. కానీ, గుండె ఆకారంలో (Heart shape) చిన్న చిన్న బిస్కెట్లుగా, పంచదార పూతతో (Sugar coated) పౌచ్ ప్యాకింగ్‌లో రావడం యువతను బాగా ఆకట్టుకుంది. ఈ బిస్కెట్స్ పిల్లలకే కాదు.. లవర్స్ కు కూడా చాలా ప్రత్యేకంగా నిలిచాయి. తీయ్యగా, క్రిస్పీగా మంచి రుచితొ కూడిన ఈ బిస్కెట్లు 90లనాటి స్కూల్ - కాలేజీ విద్యార్థులకు చాలా ఇష్టమైన స్నాక్‌గా మారాయి.
34
బ్రిటానియా బోర్బన్ (Britannia Bourbon)
ఒకప్పుడు చాక్లెట్ బిస్కెట్ ప్రియులకు బోర్బన్ మొదటి ఎంపికగా ఉండేది. రెండు క్రంచీ చాక్లెట్ బిస్కెట్ల మధ్య చాక్లెట్ క్రీమ్, పైన చల్లబడిన పంచదార స్పటికాలు దీని ప్రత్యేకత. 90ల పిల్లలు ఈ బిస్కెట్ తినడానికి ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించేవారు — మొదట పైన ఉన్న బిస్కెట్ వేరుచేసి లోపలి క్రీమ్‌ను నాకి తినడం, ఆపై మిగిలిన బిస్కెట్ తినడం ఒక సరదా అనుభూతిగా ఉండేది.
పార్లే మోనాకో (Monaco )
సాల్ట్ బిస్కెట్స్ లో క్రిస్పీగా ఉండే 'మోనాకో' బిస్కెట్లను పార్లే సంస్థ 1942లోనే పరిచయం చేసింది. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తినేవారు. టీ టైమ్ లో మోనాకో బిస్కెట్స్ తినండం ఓ తీపి జ్ఞాపకం. ఇప్పటికీ పెద్దవారు టీ టైమ్ లో తినడానికి ఎక్కువగా మోనాకోనే తీసుకెల్తారు. ఇక 1972లో మార్కెట్లోకి వచ్చిన 'క్రాక్ జాక్' భారతదేశపు మొదటి సాల్ట్ అండ్ స్వీట్ (Sweet & Salty) బిస్కెట్‌గా నిలిచింది. సాయంత్రం టీ సమయంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తినేవారు.
బ్రిటానియా సంస్థ అందించిన 'మిల్క్ బైకిస్' పాలు , పోషకాల ప్రయోజనాలతో ప్రచారంలోకి వచ్చింది. బిస్కెట్ అంచుల డిజైన్, దానిపై ఉండే ముఖచిత్రాలు పిల్లలకు ఆకట్టుకునేలా ఉండేవి. పాలలో ముంచుకుని తింటే దీని రుచి మరింత అద్భుతంగా ఉండేది. నేడు మార్కెట్లోకి వందలాది ఆధునిక, ప్రీమియం బిస్కెట్లు, కుకీలు వచ్చినప్పటికీ, 90వ దశకంలో పైసా, రూపాయి నాణేలతో కొనుక్కొని తిన్న ఆనాటి బిస్కెట్ల రుచి, అనుభూతి సాటిలేనివి. టీ కప్పులో పార్లే-జీ ముంచి తిన్న క్షణాలు లేదా స్నేహితులతో లిటిల్ హార్ట్స్ పంచుకున్న రోజులు ప్రతి 90's కిడ్ జ్ఞాపకాలలో ఎప్పటికీ మధురంగానే పదిలంగా ఉంటాయి.