World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? టాప్ 7 బెస్ట్ సిటీల లిస్ట్ ఇదే

Published : Oct 17, 2026, 12:20 PM IST

World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? ప్రఖ్యాత 'అఫార్ మీడియా' ప్రపంచంలోని అత్యుత్తమ 7 నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులోని టాప్ 7 నగరాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
1. లండన్

ఇంగ్లాండ్‌లోని లండన్ నగరం ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ నగరంలో పాత కాలపు చారిత్రక కట్టడాలు అలాగే ఆధునిక కాలపు కేఫ్‌లు, బార్లు, షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ ప్రదేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాత సంప్రదాయం ఉట్టిపడే కట్టడాలతో పాటు మోడర్న్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి లండన్ సరైన ఎంపికగా నిలుస్తోంది.

27
2. పారిస్

ప్రపంచంలోనే రొమాంటిక్ క్యాపిటల్ గా పేరుగాంచిన పారిస్ నగరం రెండో స్థానంలో నిలిచింది. కేవలం 2023 సంవత్సరంలోనే ఈ నగరానికి ఏకంగా 44 మిలియన్ల మంది సందర్శకులు వచ్చి వెళ్లారు. ఈ అద్భుతమైన గణాంకాలతో పారిస్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ నగరంగా ఘనత సాధించింది. ఇక్కడి అందమైన వాతావరణం ప్రతి ఒక్కరినీ ఇంద్రధనస్సు లాగా మంత్రముగ్ధులను చేస్తుంది.

37
3. న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్ నగరం ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వంటి ఎన్నో ప్రముఖ ప్రదేశాలు ఈ నగరంలో ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అంతర్జాతీయ టూరిస్టులతో ఈ నగరం ఎప్పుడూ రద్దీగా, సందడిగా ఉంటుంది.

47
4. టోక్యో

జపాన్‌కు చెందిన టోక్యో నగరం ప్రపంచంలోనే నాల్గవ అత్యుత్తమ నగరంగా నిలిచింది. 'అఫార్ మీడియా' అందించిన రిపోర్టు ప్రకారం, 2030 నాటికి ఈ నగరానికి 60 మిలియన్ల మంది సందర్శకులను తీసుకురావాలని టోక్యో టార్గెట్ పెట్టుకుంది. అంతేకాకుండా దీని ద్వారా 136 బిలియన్ డాలర్ల టూరిజం రెవెన్యూను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తోంది.

57
5. సింగపూర్

'ది లిటిల్ రెడ్ డాట్' అని పిలుచుకునే సింగపూర్ ఒక అత్యంత అందమైన నగరం. ఈ జాబితాలో ఇది ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలలో మెరీనా బే సాండ్స్, మెరీనా బే వంటి అద్భుతమైన ప్రదేశాలు ప్రధానమైనవి. ఇవి సింగపూర్ అందాలను మరింత పెంచి టూరిస్టులను ఇట్టే ఆకర్షిస్తాయి.

67
6. దుబాయ్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం ఆరవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన 'బుర్జ్ ఖలీఫా' ఈ నగరంలోనే ఉంది. ఈ నగరం దాని సంపదకు, అత్యంత విలాసవంతమైన జీవన శైలికి ప్రపంచవ్యాప్తంగా చాలా పేరుగాంచింది. ఇక్కడి లగ్జరీ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది.

77
7. శాన్ ఫ్రాన్సిస్కో

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో ఏడవ స్థానాన్ని దక్కించుకుంది. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఒరాకిల్ పార్క్, అల్కాట్రాజ్ ద్వీపం వంటివి ఈ నగరంలో సందర్శించదగిన అత్యంత అందమైన ప్రదేశాలలో కొన్నిగా ఉన్నాయి. ఇక్కడి సుందరమైన ప్రదేశాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories