Australia vs Switzerland for Indians: ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లకు వెళ్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో ఐటీ ఉద్యోగాలు, జీతాలు, పీఆర్ మార్గాలు, ఖర్చులు ఎలా ఉన్నాయి? భారతీయులకు ఏ దేశం బెస్ట్? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మనోళ్లు అక్కడికే ఎందుకు క్యూ కడుతున్నారు? ఆస్ట్రేలియా - స్విట్జర్లాండ్ రియల్ కథ ఇదే
ఇటీవల విడుదలైన ‘గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026’ జాబితా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత అనుకూలమైన టాప్ 7 నగరాల జాబితాలో ఆస్ట్రేలియా నుంచి మెల్‌బోర్న్ (3వ స్థానం), సిడ్నీ (4వ స్థానం) చోటు సాధించాయి. అలాగే స్విట్జర్లాండ్ నుంచి జూరిచ్ (5వ స్థానం), జెనీవా (6వ స్థానం) నిలిచాయి.
దీంతో మన భారతీయ ఐటీ ఉద్యోగులు, ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు, ఎన్ఆర్‌ఐలలో ఒకటే ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. కెరీర్‌లో గ్రోత్ సాధించడానికి, మంచి జీవనశైలిని అనుభవించడానికి ఈ రెండింటిలో ఏ దేశం బెస్ట్? జీతాలు, వీసా రూల్స్, నెలకు అయ్యే ఖర్చులు, భాష వంటి ప్రతీ అంశాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
ఆఫర్లు ఓకే.. కానీ జాబ్స్ దొరకడం ఎక్కడ ఈజీ?
స్విట్జర్లాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైండ్ బ్లాక్ అయ్యే భారీ జీతాలు. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, రీసెర్చ్ రంగాల్లో ఉండే టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌కి ఇక్కడ లభించే పే-ప్యాకేజీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడో చిన్న చిక్కు ఉంది. స్విట్జర్లాండ్‌లో స్థానిక ఐరోపా సమాఖ్య పౌరులకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. నాన్-ఈయూ పౌరులైన భారతీయులకు కంపెనీ వర్క్ వీసా లేదా స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అనేది కాస్త కష్టమైన పని.
మరోవైపు ఆస్ట్రేలియా పరిస్థితి వేరు. ఇక్కడ ఐటీ, సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతీయులకు స్కిల్డ్ మైగ్రేషన్ ప్రక్రియ ద్వారా సులభంగా ఉద్యోగాలు సాధించి అక్కడే స్థిరపడే వెసులుబాటు స్పష్టంగా లభిస్తుంది.
జీతం పరంగా చూస్తే స్విట్జర్లాండ్ టాప్. కానీ జాబ్ గ్యారెంటీ, ఈజీ స్పాన్సర్‌షిప్ కావాలంటే మాత్రం ఆస్ట్రేలియానే ముందుంటుంది.
36
జీతాలు వర్సెస్ జీవన వ్యయం: సేవింగ్స్ ఎక్కడ ఎక్కువ?
స్విట్జర్లాండ్‌లో జీతాలు ఎంత భారీగా ఉంటాయో, అక్కడ రోజువారీ ఖర్చులు కూడా అంతే రేంజ్‌లో ఉంటాయి. ఇళ్ల అద్దెలు, హెల్త్ ఇన్సూరెన్స్, నిత్యావసరాల ధరలు చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ఇన్కమ్ టాక్స్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రతీ నెలా మంచి మొత్తాన్ని పొదుపు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. స్విట్జర్లాండ్‌తో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం సుమారు 25% నుంచి 30% వరకు తక్కువగా ఉంటుంది. గ్రోసరీస్, రెస్టారెంట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు నార్మల్‌గానే అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇక్కడ పన్నుల శాతం (కాస్త ఎక్కువగా ఉంటుంది.
ప్రతీ నెలా తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా బతకాలంటే ఆస్ట్రేలియా బెటర్. భారీగా డబ్బు పొదుపు చేయడమే మీ టార్గెట్ అయితే స్విట్జర్లాండ్ అనుకూలం.
భారతీయ విద్యార్థులకు ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు పోస్ట్-స్టడీ వర్క్ వీసా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ పాయింట్ల ఆధారిత పీఆర్ సిస్టమ్ ఉండటం వల్ల చదువుకున్న దేశంలోనే పీఆర్ సాధించి స్థిరపడటం చాలా ఈజీ.
స్విట్జర్లాండ్‌లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన వరల్డ్ క్లాస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాన్-ఈయూ విద్యార్థులకు జాబ్ పర్మిట్ లేదా పీఆర్ రావడం చాలా కష్టమైన ప్రాసెస్.
విదేశాల్లో చదువుకుని, అక్కడే పీఆర్ తెచ్చుకుని స్థిరపడాలి అనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఆస్ట్రేలియానే బెస్ట్ ఛాయిస్.
56
భాష, కల్చర్: మనోళ్లకు అడ్జస్ట్ అవ్వడం ఎక్కడ తేలిక?
ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ ప్రధాన భాష కావడం వల్ల భారతీయులకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇబ్బందులు ఎదురవువు. పైగా అక్కడ ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో భారతీయ కమ్యూనిటీ ఉంది. ఇండియన్ రెస్టారెంట్లు, సాంస్కృతిక సంఘాలు, మన పండుగ వాతావరణం ప్రతీచోటా కనిపిస్తుంది.
స్విట్జర్లాండ్‌లో మాత్రం జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు మాట్లాడతారు. ఆఫీసుల్లో ఇంగ్లీష్ నడిచినా, బయట నిత్య జీవితంలో అక్కడ ఉండే స్థానిక భాషలు రాకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా, మన సంస్కృతికి దగ్గరగా ఉంటూ త్వరగా కలసిపోవడానికి ఆస్ట్రేలియానే చాలా అనుకూలం.
66
లైఫ్‌స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్: ఎవరి మార్క్ ఏంటి?
స్విట్జర్లాండ్‌లోని జూరిచ్, జెనీవా నగరాలు అద్భుతమైన ఆల్ప్స్ పర్వత అందాలు, ప్యూర్ ఎయిర్, అత్యంత తక్కువ నేరాల రేటు, డిసిప్లిన్ ఉన్న సమాజానికి ప్రసిద్ధి చెందాయి. రిచ్ అండ్ లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకునే వారికి ఇది డ్రీమ్ లొకేషన్.
ఇక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలు బ్యూటిఫుల్ బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, నైట్ లైఫ్, స్పోర్ట్స్ కల్చర్, మల్టీ-కల్చరల్ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి.