Ennenno Janmala Bandham: మాళవికపై సీరియస్ అయిన యష్.. భ్రమరాంబికకు అసలు విషయం చెప్పిన కైలాష్?

First Published Jan 19, 2023, 1:17 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 19వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేద కారులో వెళ్తూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వేద నీకు ఇప్పుడే చెప్తున్నాను నా మైండ్ లో నుంచి యష్ అనే పేరు డిలీట్ చెయ్ అని అనుకుంటూ ఉండగా మరొకవైపు యష్ ఆవిడ గారు లేకపోతే నాకేం పనులు జరగవా వేద అనే పేరు డిలీట్ చేసేసెయ్ గుడ్ బాయ్ అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే యష్ కి మాళవిక ఫోన్ చేసి నవ్వగా నువ్వా ఎందుకు ఫోన్ చేశావు అనడంతో నా నవ్వుని మర్చిపోలేవు నన్ను మర్చిపోలేవు అనగా ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు వేద ఈయన మూడ్ ఆఫ్ లో ఉన్నారు అసలు ఆఫీస్ కి వెళ్లారు లేదో అనుకుంటూ ఉంటాడు.

మరోవైపు మాళవిక, యష్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వేద ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయకుండా మాళవిక తోనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈయనలో నాకు ఇదే నచ్చనిధి. డ్రైవ్ చేస్తూ ఎవరైనా ఇంతసేపు ఫోన్ మాట్లాడతారా అనుకుంటూ ఉంటుంది వేద. ఫోన్ కట్ చెయ్ ఫస్ట్ అని యష్ కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు అదే సమయంలో వేద ఫోన్ చేయడంతో మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తావ్ ఏంటి మాళవిక. వేదకు తెలిస్తే అని నెంబర్ చూసి సారీ వేద అనగా బాధతో ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు యష్ మళ్ళీ వేదకు ఫోన్ చేయగా వేద ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు యష్, వేదకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వేద ఫోన్ లిఫ్ట్ చేయగా ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావ్?
 

ఎప్పుడు నీది నీవేనా నేను చెప్పేది వినవా అనడంతో ఏంటి నువ్వు మొగుడిలా పెత్తనం చాలా ఇస్తున్నావు నేను కేవలం ఖుషికి మాత్రమే తల్లిని మాత్రమే నీకు పెళ్ళాన్ని కాదు అని అంటుంది వేద. అప్పుడు యష్ తనని తానే తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు వేద కార్లు వెళ్తూ ఆయన గారు మాళవికతో మాట్లాడితే నీకెందుకు ఎవరిదో మాట్లాడితే నీకెందుకు అక్కడ ఏదో ఆయన నీకు సొంత మొగుడు నువ్వు ఆయన సొంత పెళ్ళాం అయినట్టు ఫీల్ అవుతున్నావు వేద అంటూ తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఒకవైపు పెళ్ళాం కాదంటుంది కానీ వేరే వాళ్లతో మాట్లాడితే తట్టుకోలేదు. పెళ్ళాం లాగా నామీద పెత్తనం చలాఇస్తుంది అనుకుంటూ ఉంటాడు. మరోవైపు వేద కోపంలో సవాలక్ష అనుకుంటాం అలా అని మేము మొగుడు పెళ్ళాం కాకుండా పోతామా అనుకుంటూ ఉంటుంది.

మరోవైపు మాళవిక ఎంత పొగరు నా ఫోనే కట్ చేస్తావా నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది మాళవిక. వెనక్కి తిరిగి చూడగా అక్కడ బ్రమరాంబిక ఉండడంతో అది చేసి మాళవిక షాక్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ బంగారం అనడంతో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్పగా ఫ్రెండ్ తో అయితే మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటుంది భ్రమరాంబిక. తప్పు చేసినవాడే ఎప్పుడు భయపడుతూ ఉంటాడు కానీ నువ్వు తప్పు చేయలేదు కదా అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు అంటుంది భ్రమరాంబిక. నీకు నీ పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకు వస్తున్నాయా అనగా చెప్పాను కదా నాకు ఏమీ ఇబ్బంది లేదు అనడంతో నువ్వేం చెప్పొద్దు మాళవిక నేను మొత్తం వినేశాను అంటుంది భ్రమరాంబిక.
 

 అప్పుడు ఇందాక నువ్వు పనిమనిషి తో మాట్లాడినప్పుడు నేను విన్నాను. వదినను కిచెన్ లోకి రాని వద్దు నేను చేసి గోరుముద్దలు పెడతాను అన్నాను ఇలాంటి వాటికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను ఏదో టెన్షన్ పెడదామని ఎలా మాట్లాడాను అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది భ్రమరాంబిక. అంత బిల్డప్ ఇచ్చి లాస్ట్ కి తుస్సుమనిపించింది ఎంతమాత్రం కైనా అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు యష్ ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడు పదేపదే మాళవిక అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వేద హాస్పిటల్లో పనిచేసుకుంటూ యష్ తో మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటే డిస్టబ్ అవుతుంది.
 

మరొకవైపు యష్ కి రాజా వాట్సాప్ లో ఫోటో సెండ్ చేయడంతో అవి చూసి సంతోష పడుతూ వేదకీ ఇవి సెండ్ చేస్తే అవి చూసైనా సంతోషపడుతుంది అనుకుంటూ సెండ్ చేస్తాడు. ఆ తర్వాత వేద ఆ ఫోటో చూసి ఈ ఫోటో చూసి ఇప్పుడు నేను కూల్ అవ్వాలా అనుకుంటూ ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా కోపం తగ్గినట్టు లేదు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు భ్రమరాం ఇక మాళవికతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే కైలాష్ అక్కడికి వచ్చి జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోతుండగా కైలాష్ అని పిలవడంతో అక్కడికి వస్తాడు. అప్పుడు ఏంటి కైలాష్ నా దగ్గరకు ఏదో నిజం చెబుదామని వచ్చి వాటికి డబ్బులు విలువ కట్టలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నావా అని మనసులో మాట చెబుతుంది భ్రమరాంబిక.
 

 అప్పుడు భ్రమరాంబిక ఏం జరిగింది అని అడగడంతో కైలాష్ జరిగింది మొత్తం వివరించగా కోపంతో భ్రమరాంబిక ,అభి దగ్గరికి వెళుతుంది. ఏంటి నీకు మాళవికతో పెళ్లా అనగా అవునక్కా నేను చెబుదామనుకున్నాను కానీ ఇంతలో నువ్వే తెలుసుకున్నావు నువ్వే మా ఇద్దరికి దగ్గర ఉండి పెళ్లి చేయాలి అనడంతో స్టాపిడ్ అని అంటుంది భ్రమరాంబిక. ఎట్టి పరిస్థితులలో నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అనగా ఎట్టి పరిస్థితులలోను నేను మాళవికను వదులుకోలేను అక్క అని అంటాడు. అప్పుడు కైలాష్ చెంపలు వాయిస్తూ ఉండగా మేడం నేను కైలాస్ ని మేడం మీరు మీ తమ్ముడు అనుకొని నా చెంపలు వాయిస్తున్నారు అని అంటాడు. ఈ నిజం ఇలాగే దాచి ఉంచు లేదంటే నష్టపోతావు అని అంటుంది భ్రమరాంబిక. మరొకవైపు ఖుషి,వేద యష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే యష్,వేద ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు.

click me!