సిల్క్ స్మితను కొట్టే ఆడదే లేదు, శ్రీదేవి సైతం ఫాలో అయ్యేది: బాలయ్య సంచలనం

First Published Jul 27, 2021, 9:55 AM IST

అరుదుగా మీడియా ముందుకు వచ్చే బాలయ్య, వస్తే మాత్రం ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తాడు. ఆయన హీరోగా నటించిన ఆదిత్య 369 ఇటీవల 30ఏళ్ళు పూర్తి చేసుకుంది. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369కి పని చేసిన దర్శక నిర్మాతలు, నటులు తమ మనోభావాలు పంచుకున్నారు. 

బాలయ్య ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనడంతో పాటు పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆదిత్య 369లో దివంగత నటి సిల్క్ స్మిత ఓ కీలక రోల్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఎపిసోడ్ లో ఆమె బాలయ్యపై మనసు పడే, రాజా నర్తకి పాత్ర చేయడం జరిగింది.
undefined
నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ రోల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సిల్క్ స్మిత ప్రస్తవన నేపథ్యంలో బాలయ్య ఆమెను ఆకాశానికి ఎత్తారు.
undefined
సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ.. ఆమె బాల్యం చెన్నైలో గడవడం వలన సిల్క్ స్మితకు తెలుగు సరిగా వచ్చేది కాదన్నారు.  ఓ సినిమా కోసం భారీ  తెలుగు డైలాగ్ చెప్పాల్సి రావడంతో.. తెలుగులో మొదలుపెట్టి, ఇంగ్లీష్ ఆ డైలాగ్ ముగించింది. డైలాగ్ ఓకేనా సార్.. అని సిల్క్ స్మిత అనడంతో సెట్ లో ఉన్నవాళ్ళం అందరం షాక్ అయ్యాం. అప్పుడు డైరెక్టర్ అమ్మా.. నువ్వు డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్పావ్ అన్నారట. దానితో అందరూ నవ్వారట.
undefined
స్పెషల్ సాంగ్స్ కి సిల్క్ స్మిత ఫేమస్, కానీ ఆదిత్య 369లో ఆమెకు ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాము. మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను కొట్టిన ఆడదే లేదు అన్నారు బాలయ్య.
undefined
దానికి కారణం శ్రీదేవి సైతం సిల్క్ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్ ని ఇమిటేట్ చేసేది. ఒక డాన్సర్ ని స్టార్ హీరోయిన్స్ ఫాలో కావడం మాములు విషయం కాదని బాలయ్య తెలిపారు.
undefined
సిల్క్ స్మితకు ముఖంలో సహజంగానే ఓ ఆకర్షణ ఉంటుంది. ఆదిత్య 369లో మా ఇద్దరి మధ్య వచ్చే, జాణవులే.. నెరజాణవులే, సాంగ్ సూపర్ హిట్ అంటూ బాలయ్య గుర్తు చేసుకున్నారు.
undefined
ఇదే ఇంటర్వ్యూలో తండ్రి ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడే క్రమంలో, దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నపై అవమానకర కామెంట్స్ చేశారు బాలయ్య.
undefined
జేమ్స్ కేమరూన్, ఏ ఆర్ రెహమాన్ వంటి దిగ్గజ టెక్నిషియన్స్ ని కూడా కించ పరిచేలా బాలయ్య మాట్లాడడం, వివాదాస్పదం అయ్యింది.
undefined
click me!