కొత్త లవర్ తో ఫైమా బర్త్ డే పార్టీ, సడన్ గా ప్రవీణ్ ఎంట్రీ... నీకు కొంచెం కూడా అది లేదా అంటూ ఫైర్!

Published : May 20, 2024, 11:55 PM IST

ఫైమా బర్త్ డే పార్టీలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తన కొత్త లవర్ ని పరిచయం చేసిన కాసేపట్లో పాత లవర్ ప్రవీణ్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో అక్కడ ఏం జరిగిందనే వాదన మొదలైంది. 

PREV
17
కొత్త లవర్ తో ఫైమా బర్త్ డే పార్టీ, సడన్ గా ప్రవీణ్ ఎంట్రీ... నీకు కొంచెం కూడా అది లేదా అంటూ ఫైర్!
Faima Praveen

ఫైమా-ప్రవీణ్ పటాస్ షోలో మొదటిసారి కనిపించారు. అనంతరం ఫైమా జబర్దస్త్ కి వచ్చింది. లేడీ కమెడియన్ గా ఎదిగింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ కూడా రాణించింది ఫైమా. పది వారాలకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. 

27
Faima Praveen

బిగ్ బాస్ షోకి వెళ్లిన కారణంగా కొన్నాళ్లు జబర్దస్త్ కి దూరమైంది ఫైమా. హౌస్లో తన లవర్ గా ప్రవీణ్ పేరు చెప్పింది. తనకు ఎవరు లేరు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ప్రవీణ్ అంటే ఇష్టం అన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. 

 

37
Faima-Praveen

హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రవీణ్ ఆమెను కలిశాడు. తన మెడలో ఉన్న చైన్ ఫైమాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. సవ్యంగా సాగుతున్న వీరు రిలేషన్ లో అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వీరు విడివిగా ఉంటున్నారు. ప్రవీణ్-ఫైమా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. 

47
Jabardasth Faima

ప్రవీణ్ పలు ఇంటర్వ్యూలలో ఫైమా గురించి మాట్లాడాడు. ఆమె నన్ను వదిలేసింది. ఇప్పుడు వచ్చినా నేను కలిసేందుకు సిద్ధం అని ప్రవీణ్ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఫైమాను ఇదే విషయం అడగం జరిగింది. ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. బుల్లితెర మీద కనిపించే జోడీలు అన్ని రియల్ కాదు. కేవలం ఒకటి రెండు మాత్రమే రియల్. స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తాము. మా జంటను ఆడియన్స్ అంగీకరించారు. ఆదరించారు. దాని వలన మేము విడిపోయాము అంటే వాళ్ళు బాధ పడొచ్చు. 
 

57
Jabardasth Faima

ప్రవీణ్ తో నాకు వ్యక్తిగత మనస్పర్దలు ఉన్నాయి. అందుకే మేము దూరం కావాల్సి వ్ వచ్చిందని ఆమె అన్నారు. కట్ చేస్తే.. ఆమె ప్రవీణ్ నాయక్ అనే మరో కుర్రాడిని పరిచయం చేసింది. అతడు ఫైమా బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ప్రవీణ్ నాయక్ ఓ లివ్లీ కామెంట్ కూడా చేశాడు. 
 

67
Jabardasth Faima

ఐదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదు. నీతో జీవితాంతం ఉండాలని ఉంది. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్ డే అని కామెంట్ చేశాడు. గతంలో ఎన్నడూ ఫైమా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని పరిచయం చేసింది లేదు. దాంతో అందరు షాక్ అవుతున్నారు. 
 

77
Jabardasth Faima

ఇదిలా ఉంటే ఈ బర్త్ డే పార్టీకి ఫైమా మాజీ లవర్ ప్రవీణ్ కూడా వచ్చాడు. అతనితో ఓ రీల్ చేసిన ఫైమా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు టిల్లు స్క్వేర్ స్పూఫ్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేశారు. ఫైమా బర్త్ డే పార్టీలో ఫైమా ఇద్దరు లవర్స్ ప్రవీణ్, ప్రవీణ్ నాయక్ ఉండటంతో అసలు ఏం జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories