ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఒకరి గురించి ఒకరు ఒక్క మాటల్లో ఏం చెప్పారంటే?.. ఫ్యాన్స్ మర్చిపోలేని మాట

Published : May 20, 2024, 02:23 PM ISTUpdated : May 20, 2024, 02:31 PM IST
ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఒకరి గురించి ఒకరు ఒక్క మాటల్లో ఏం చెప్పారంటే?.. ఫ్యాన్స్ మర్చిపోలేని మాట

సారాంశం

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లో మంచి స్నేహితులు. ఈ ఇద్దరు స్నేహాన్ని పలు సందర్భాల్లో తెలియజేశారు. అయితే ఒకొరి గురించి ఒకరు ఒక్క మాటల్లో ఏం చెప్పారంటే?  

ఎన్టీఆర్ నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అల్లు అర్జున్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఒకరినొకరు బావ.. బావా.. అని పిలుచుకుంటారు. సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేయాలన్నా ఇలానే వారి మధ్య కన్వర్జేషన్‌ జరుగుతుంది. ఇక తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్‌ తెలిపారు బన్నీ. 

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియో క్లిప్పులను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. ఇద్దరి మధ్య బాండింగ్‌ని తెలియజేసేలా అయా ఫోటోలు, వీడియోలు ఉండటం విశేషం. దీంతో తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరు ఒకరి గురించి మరొకరు చెప్పుకున్న విషయాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఒకరియాక్టింగ్‌ గురించి, కెరీర్‌ గురించి ఒక్క మాటల్లో చెప్పుకున్నారు. 

గత కొన్నేళ్ల క్రితం ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్లో పాల్గొన్నారు. ఇందులో ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారని బన్నీని యాంకర్‌ సుమ అడిగింది. దానికి కాసేపు ఆలోచించుకున్న అల్లు అర్జున్‌.. `రియల్‌ టాలెంట్‌` అని సింపుల్ గా ఒకే వర్డ్ లో తారక్‌ ఏంటో చెప్పేశాడు. ఇక ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. బన్నీ గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే.. అనగా, `అమేజింగ్‌ ఫ్రెండ్‌. కష్టపడి పైకి వచ్చిన వారిలో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి` అని చెప్పారు తారక్‌. దీంతో ఇద్దరూ ఎమోషనల్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతూ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. 

ఇక తాజాగా ఎన్టీఆర్‌కి బన్నీ బర్త్ డే విషెస్‌ చెబుతూ, `మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్‌ ది డే బావ.. ఫియర్ ఈజ్‌ ఫైర్‌` అని పేర్కొన్నారు. భయం కూడా అదిరిపోయేలా ఉంది అని ఆయన వెల్లడించారు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి `ఫియర్‌` సాంగ్‌ని ఆదివారం సాయంత్రం విడుదల చేయగా, ఇది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో తారక్‌ చాలా పవర్‌పుల్‌గా కనిపిస్తున్నారు. 

మరోవైపు ప్రశాంత్‌ నీల్‌తో చేయబోతున్న సినిమా అప్‌ డేట్‌ ఇచ్చారు. ఆగస్ట్ లో దీన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. దీంతోపాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న `వార్‌ 2` నుంచి తారక్‌ ఫస్ట్ లుక్‌ రాబోతుందట. అలాగే ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌.. ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి