ప్రధానికి 'లాటరీ'.. ఆర్థిక పరిస్థితుల్లో కూడా భర్త కంటే భారీగా పెరిగిన భార్య ఆదాయం..

By Ashok kumar Sandra  |  First Published May 20, 2024, 11:06 PM IST

రిషి సునక్ 2022-23లో రూ. 23 కోట్లు ఆర్జించగా, అక్షత మూర్తి గత ఏడాది మాత్రమే డివిడెండ్‌గా రూ.136 కోట్లు అందుకున్నారు. అంటే అక్షతా మూర్తి సంపాదన భర్త కంటే ఎక్కువ
 


సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం బ్రిటన్‌లో కోటీశ్వరుల సంఖ్య తగ్గుతోంది, అయితే అక్కడి ప్రధాన మంత్రి రిషి సునక్ సంపద మాత్రం భారీగా పెరిగింది. బ్రిటన్‌ ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రిషి సునక్ ఇంకా  అతని భార్య అక్షతా మూర్తి సంపద ఎగిసింది. ఈ జంట మొత్తం సంపద విలువ 651 మిలియన్ పౌండ్లతో(దాదాపు రూ. 6890 కోట్లు) ఈ లిస్టులో 245వ స్థానానికి చేరుకుంది, అయితే గత సంవత్సరం 275వ స్థానంలోఉన్నారు.  

రిషి సునక్ 2022-23లో రూ. 23 కోట్లు ఆర్జించగా, అక్షత మూర్తి గత ఏడాది మాత్రమే డివిడెండ్‌గా రూ.136 కోట్లు అందుకున్నారు. అంటే అక్షతా మూర్తి సంపాదన భర్త కంటే ఎక్కువ. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా ఈ ఏడాది ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం. అక్షత తండ్రి నారాయణ మూర్తి స్థాపించిన బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో అక్షత మూర్తి షేర్ల విలువ పెరిగింది. దింతో  ఒక సంవత్సరంలో £108.8 మిలియన్లు పెరిగి దాదాపు £590 మిలియన్లకు చేరుకుంది. అదే సమయంలో, ఈ జంట ప్రస్తుత నికర విలువ 2022 కంటే తక్కువగా ఉంది.

Latest Videos

సండే టైమ్స్ రిచ్ లిస్ట్ కూడా కింగ్ చార్లెస్ సంపద గత సంవత్సరంలో £600 మిలియన్ల నుండి £610 మిలియన్లకు పెరిగిందని చూపిస్తుంది. ఇదిలా ఉండగా, బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య వరుసగా మూడో ఏడాది పడిపోయింది. 2022లో 177గా ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 165కి చేరింది.

click me!