పోర్షే, బెంజ్ తర్వాత మరో లగ్జరీ కారు కొన్న ఎక్ దో తీన్ బ్యూటీ.. అక్షరాలా ఎంతంటే ?

First Published | May 20, 2024, 11:30 PM IST

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మీకు గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు ఎక్ దో తీన్ సాంగ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆమె  వయసు 56 అంటే అస్సలు నమ్మలేరు. అయితే ఇప్పటికి  కూడా అందంగా కనిపించే మాధురీ దీక్షిత్ దగ్గర  కళ్ళు చెదిరె ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ లైన్‌లోకి మరొ కారు చేరింది. ఈసారి మాధురి దీక్షిత్ లగ్జరీతో సహా  ఖరీదైన కారును కొనుగోలు చేసింది. అయితే ఈ కారు ధర ఎంత అనుకుంటున్నారు ?
 

నటి మాధురీ దీక్షిత్‌కు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్ సినిమాలు, రియాల్టీ షోలతో బిజీగా ఉన్న మాధురీ దీక్షిత్ ఇప్పుడు మరో ఖరీదైన కారును సొంతం చేసుకుంది. ఈసారి రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB 3.0ని కొనుగోలు చేసింది. ఈ కారు డీజిల్ వేరియంట్ ధర అక్షరాలా రూ.4 కోట్లు.
 

భర్త శ్రీరామ్ నేనేతో కలిసి మాధురి కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారులో  కనిపించింది. ఇద్దరు కలిసి కొత్త కారులో ముంబైలో ప్రయాణించారు. 
 


మాధురి సన్‌సెట్ గోల్డ్ గ్లాసీ ఫినిష్ కారును కొనుగోలు చేసింది. ఈ కలర్ కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ కారు.
 

మాధురీ దీక్షిత్ ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ S560 కారులో కనిపిస్తారు.  దీని ధర 2 కోట్ల రూపాయలు.
 

మాధురి భర్త శ్రీరామ్ దగ్గర కూడా చాలా సూపర్ కార్లు ఉన్నాయి. పోర్షే, 911, ఫెరారీ 296 GTBతో సహా మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ లైన్‌లో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా వచ్చి చేరింది.
 

మాధురి, శ్రీరామ్‌కి టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ మాక్స్  కారు ఉంది. నెక్సాన్ EV డార్క్ ఎడిషన్ కారులో కొన్ని సార్లు కూడా  కనిపించింది.

Latest Videos

click me!