ఎవరినో సంతోషపెట్టడానికి కాదు మనం ఉన్నది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..లైఫ్‌ని ఎలా లీడ్‌ చేయాలో చెప్పిన సామ్‌

Published : Dec 19, 2022, 01:15 PM ISTUpdated : Dec 19, 2022, 01:42 PM IST

మనం ఈ భూమి మీదకు వచ్చిందని ఎవరినో సంతోషపెట్టడానికి కాదని, ఎవరి అభినందనల కోసమే ఆరాట పడాల్సిన అవసరం లేదని చెబుతోంది సమంత. లైఫ్‌ని ఎలా లీడ్‌ చేయాలో తన ఫిలాసఫీ వెల్లడించింది.  

PREV
15
ఎవరినో సంతోషపెట్టడానికి కాదు మనం ఉన్నది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..లైఫ్‌ని ఎలా లీడ్‌ చేయాలో చెప్పిన సామ్‌

సమంత(Samantha).. సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌. లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కి చేరువలో ఉంది. ఇప్పటికే `యశోద` సినిమాతో సత్తా చాటింది. మున్ముందు మరిన్ని పాన్‌ ఇండియా సినిమాలతో రాబోతుంది. అయితే గత కొంత కాలంగా ఆమె మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకోలేదు. ఇంకా ఆ వ్యాధితోనే బాధపడుతుందట. పూర్తిగా నయం కావడానికి కొంత టైమ్‌ పడుతుందని తెలుస్తుంది. 
 

25

ఈ నేపథ్యంలో `యశోద` ప్రమోషన్‌లో ఓ సారి ప్రత్యేక చిట్‌చాట్‌లో పాల్గొన్న సమంత.. ఆ తర్వాత మరోసారి బయటకొచ్చింది. ఆమె కార్యక్రమంలో పాల్గొని తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు కోపం వస్తే జిమ్‌లో అధికంగా వర్కౌట్స్ చేస్తుందట. ఇష్టానుసారంగా ఎక్సర్‌ సైజ్‌లు చేస్తానని, వెంటనే కోపం తగ్గిపోతుందని చెప్పింది సమంత. 
 

35

ఇంకా సమంత చెబుతూ, తాను డబ్బుకి, పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడనని తెలిపింది. తనకు డబ్బు కంటే నటనే ముఖ్యమని చెప్పింది. తాను చేసే ప్రతి పాత్రని ఆస్వాదిస్తానని, అలా నటించకపోతే అందులో ఎలాంటి సంతోషంగానీ, ప్రయోజనం గానీ ఉందన్నారు. తనకు తానే పెద్ద విమర్శకురాలినని, మన మిస్టేక్స్ ని, పొరపాట్లని తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని చెప్పారు. తాను చేసిన పని తానే చెక్‌ చేసుకుంటానని చెప్పింది. 
 

45

కాలం కలిసి వస్తేనే ఏదైనా జరుగుతుందని చెప్పింది. ఆ సమయంలో బాధపడకుండా, ఆ ఆలోచనలు పక్కన పెట్టి నిద్రపోతానని చెప్పింది సామ్‌. మనకు నచ్చినట్టుగా జీవించాలని, భూమ్మీదకు వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతర సంతోషపెట్టడానికో కాదని, మనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని, అప్పుడే మనకు కావాల్సింది వెతుక్కుంటూ వస్తుందని చెప్పింది సమంత. స్టార్‌ హీరోయిన్‌ లైఫ్‌కి సంబంధించిన ఫిలాసఫీ పట్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చెప్పినదాన్ని అంగీకరిస్తున్నారు. 

55

సమంత ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యింది. ఆమె కోసం `ఖుషి` టీమ్‌ వెయిట్‌ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `శాకుంతలం` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. అలాగే బాలీవుడ్‌ మూవీస్‌ కి కూడా కమిట్‌ అయ్యింది సమంత. అవన్నీ సమంత కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories