Vijay Birthday: విజయ్ దళపతి కార్ కలెక్షన్.. బొమ్మ కారు నుంచి బీఎమ్ డబ్ల్యూ వరకూ, హీరో గ్యారేజ్ లో 20 కార్లు

First Published | Jun 22, 2024, 2:50 PM IST

కార్లంటే ఎవరకి ఇష్టం ఉండదు చెప్పండి.. ఇక స్టార్ హీరోలలో చాలామంది కార్ల ప్రియులు ఉన్నారు. వారు తమ గ్యారేజ్ లను అరుదైన .. ఖరీదైన కార్లతో నింపడం చూస్తూనే ఉన్నాం. తాజాగా విజయ్ దళపతి దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం. 

vijay cars

దలపతి విజయ్ చిన్నప్పటి నుంచి కార్ల ప్రేమికుడు. చిన్నప్పుడు బొమ్మ కార్లు కూడా బాగా కొనేవాడట. ఇక హీరోగా  సంపాదన ప్రారంభించిన తర్వాత తనకు ఇష్టమైన కార్లు కొనడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం, అతని వద్ద వింటేజ్, BMW, మినీ కూపర్, టయోటా ఇన్నోవా, ఆడి A8 వంటి టాప్ మోడల్ కార్లు ఉన్నాయి, ఇక ఆయన గ్యారేజ్ లో ఉన్న కార్ల గురించి చూస్తే.. 

5 నిమిషాల సీన్ కోసం 5 నెలలు షూటింగ్, రాజమౌళిని మించిపోయిన దర్శకుడు ఎవరంటే..?

తలపతి విజయ్ సంపాదించడం ప్రారంభించిన తర్వాత, అంటే 90 తర్వాత, విజయ్ కొన్న కారు టాటా ఎస్టేట్‌తో ప్రేమలో పడ్డాట.  అప్పట్లో దీని ధర రూ.2.52 లక్షలు. మొదట్లో ఈ కారులోనే తలపతి తన స్నేహితులతో కలిసి చెన్నైలో.. ఫుల్ గా షికార్లు చేసేవారట. దీని తరువాత, పాత మోడల్ కారు ప్రీమియర్ 118 N.E ను దళపతి విజయ్ కొనుగోలు చేశారు. (ప్రీమియర్ 118 NE). ఈ మోడల్ వచ్చిన కొద్ది వారాల్లోనే ఈ కారును కొన్నారట విజయ్. దీని విలువ రూ.6 లక్షలు.. విజయ్ స్టార్ డమ్ పెరిగే కొద్ది.. తలపతి విజయ్ కొన్న కార్ల రేటు కూడా పెరిగింది. ఆ విధంగా, విజయ్‌కి ఇష్టమైన కార్లలో ఒకటి 1990లలో ప్రజాదరణ పొందిన టయోటా సెరా. దీని ధర .15 లక్షలు ఉంటుంది.

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?


విజయ్ గ్యారేజ్ లోకి ఒక్కొక్కటిగా కార్లు వస్తూనే ఉన్నాయి. ఆయన అప్పట్లో బాగా ఫేమస్ అయిన  టయోటా ఇన్నోవా క్రిస్టా ను కూడా కొన్నారు. దీని ధర. దాదాపు 20 లక్షల నుంచి రూ.26.05 లక్షల మధ్య ఉంటుందని చెబుతున్నారు.ఈ కారు కొన్న తర్వాత తరచూ కార్లు కొనడం తలపతికి హాబీగా మారింది. వరుసగా ఎన్నో లగ్జరీ కార్లు కొన్నాడు. ఆయన నిర్మించిన ఇంట్లో కారు పార్క్ చేయడానికి లిఫ్టింగ్ మోడల్ పార్కింగ్  కూడా ఉందట. ఇక  అతను లగ్జరీ కార్లు కొనడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఇష్టపడి కొన్న కారు  రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒకటి. ఈ కారు ధర దాదాపు రూ.8 కోట్లు.

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

vijay cars

అలాగే ఇటీవల పలువురు సెలబ్రిటీల వద్ద ఉన్న ఆడి ఏ8 ఎల్ మోడల్ కారు. ఈ కారు ఇండియాలో లాంచ్ అయినప్పుడు తలపతి ఈ కారును కొనేశారు. దీని ధర  దీని ధర రూ.1.58 కోట్లు. తలపతి విజయ్ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫాంటమ్, దీని ధర రూ. 8.99 కోట్లు.
 

ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. నా వయస్సు 23 ఏళ్ళు.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ఎవరిగురించి..?

vijay cars

తలపతి విజయ్ భార్య సంగీత కూడా కారు ప్రియురాలు. సాధారణంగా ఆమెకు  బిఎమ్‌డబ్ల్యూ టైప్ కార్లంటే ఇష్టమని చెబుతున్నారు. అందుకే విజయ్ భార్య కొనుగోలు చేసిన ఎక్స్6 (బీఎండబ్ల్యూ ఎక్స్6) లగ్జరీ కారు ధర 1.04 కోట్ల నుంచి రూ.1.11 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.నిస్సాన్ ఎక్స్-ట్రాయ్ దళపతి విజయ్‌కి ఇష్టమైన కార్లలో ఒకటి, ఇది చూడటానికి అందంగా.. డ్రైవింగ్ చేయడానికి సాఫీగా ఉంటుంది.

vijay cars

BMW 7-సిరీస్ విజయ్  భార్యకు ఇష్టమైన బ్రాండెడ్ కారు. అయితే వీరిద్దరు  చెన్నైలో ఎక్కడికి వెళ్లినా ఈ కారులోనే వెళ్తారట. ఇక విజయ్  మెర్సిడెస్ బెంజ్ GLA కమాండర్ ను కూడా  వదిలిపెట్టలేదు. ఈ కారు చాలా బాగుంది... ఈ కారు ధర రూ.89 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.తలపతికి మినీ కూపర్ ఎస్ కూడా ఉంది. విజయ్ కారు గ్యారేజ్ లో ఇది స్పెషల్.  దీని ధర.. 41 లక్షల నుంచి 52.50 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

vijay cars

ఆ రకంగా చూస్తే ఖరీదైన కార్లనే కాదు తక్కువ ధరలో ఉండే కార్లను కూడా విజయ్ కొనే అలవాటు కలిగి ఉన్నారు.  తలపతి... కారు గ్యారేజ్ లో కోట్ల విలువ చేసే కార్లతో పాటు  మారుతి సుజుకి సెలెరియో కూడా ఉంది. దీని ధర 5.3 లక్షల నుంచి  6.6 లక్షలు

vijay cars

.తొలినాళ్లలో అతడి వద్ద ఉన్న కొన్ని కార్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయని... మొత్తం 20  కార్ల వరకూ విజయక కలిగి ఉన్నారటి తెలుస్తోంది.  కొత్త కలెక్షన్లతో విలాసవంతమైన కార్లు విడుదలైతే మన దళపతి నిరభ్యంతరంగా కొనుగోలు చేస్తాడనడంలో సందేహం లేదు.

Latest Videos

click me!