పవిత్ర గౌడ లో ఇదేం శాడిజం? కర్రలతో కొట్టి,కరెంట్ షాక్ ఇచ్చి ,మర్మావయావాలుపై...

First Published Jun 22, 2024, 2:43 PM IST

 అతని వృషణాలపై తన్నడంతో తీవ్రగాయాలైనట్లు వెల్లడైంది. చిత్రహింసలు పెడుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 


 కన్నడ నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తూ షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. హత్యకు ముందు రేణుకా స్వామికి కరెంటు షాక్‌ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారనే విషయం ఇప్పటికే బయిటకు వచ్చింది. అయితే  ఆ సమయంలో పవిత్రా గౌడ ఘటనా స్థలంలోనే ఉన్నారని తాజాగా వెల్లడైంది. వాటిని ఆమె కళ్లారా చూశారని పోలీసుల విచారణలో తేలి అందరకీ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. దర్శన్ మాత్రమే ఈ దారుణంలో యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడనుకుంటే పవిత్రాగౌడ్ సైతం ఈ దారుణం కళ్ళారా చూస్తూ రెచ్చగొట్టిందని వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే...


దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని(33) దారుణంగా హత్యకు గురి అయ్యారు. చిత్రదుర్గకు చెందిన ఫార్మసీలో పనిచేసే రేణుకా స్వామిని బెంగళూర్ తీసుకువచ్చి హింసించి హత్య చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారి కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. పెళ్లై భార్య, కుమారుడు ఉన్న దర్శన్, పవిత్ర గౌడతో రిలేషన్‌ ఉండటం గురించి అసభ్యకరమై పోస్టులు పెట్టడంతోనే రేణుకా స్వామి హత్య జరిగింది. 
 

Latest Videos



జూన్‌ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గలో అపహరించిన కొందరు దుండగులు..అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. పట్టణగెరెలో ఉన్న ఓ షెడ్డులో బాధితుడిని చిత్రహింసలకు గురిచేశారు. తాను శాకాహారినని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించి వేధించారు. అనంతరం అతడిపై కర్రలతో దాడి చేసి, పలుమార్లు కరెంటు షాక్‌ ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో పవిత్రా గౌడ కొద్దిసేపు అక్కడే ఉన్నారని.. దర్శన్‌ అతడిని కొట్టడాన్ని కళ్లారా చూశారని తెలిసింది.
 


అలాగే శరీరంపై అనేక చోట్ల గాయాలు ఉండడం, తీవ్ర రక్తస్రావంతోనే రేణుకాస్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మర్మావయవాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు ఒక చెవి కూడా కనిపించలేదని తేలింది. అతని వృషణాలపై తన్నడంతో తీవ్రగాయాలైనట్లు వెల్లడైంది. చిత్రహింసలు పెడుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె అసలు అంత దారుణం ఆపకుండా ఎలా చూడగలింది అంటున్నారు. కరుడు కట్టిన రౌడీలు వేరు. కానీ ఆమె ఓ స్త్రీ కదా సెన్సిటివ్ నెస్ ఏమైంది అంటున్నారు. 


నిందితురాలు పవిత్రాగౌడను   పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. ఆమెకు విచారణ ఖైదీ సంఖ్య -6024ను అధికారులు కేటాయించారు. రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. పదే పదే లేచి గదిలో పచార్లు చేశారు. ఆమెతో పాటు తొమ్మిది మందిని ఏసీఎంఎం న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. 
 


విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న పవిత్ర.. కారాగారం గదిలో ఒంటరిగా మారారు. నిద్ర రాక పదేపదే లేచి కూర్చున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదింటికే లేచి పరిసరాల్లో నడక సాగించారు. ఆపై ఉపాహారం ఆరగించి, కాఫీ తాగారు. హత్య కేసులో ఆమె ప్రథమ నిందితురాలు. ఆమె ఆదేశాలతోనే మిగిలిన వారు రేణుకాస్వామిపై దాడిచేసి చంపారనేది అభియోగం.

Pavithra Gowda Darshan


దర్శన్‌ అడిగిన వెంటనే రూ.40 లక్షలు సమకూర్చిన మోహన్‌రాజ్‌ ఆచూకీ తెలియలేదు. ఆ నగదులో రూ.37 లక్షలను ఇప్పటికే సీజ్‌ చేశారు. ఓ మేకప్‌మెన్‌ సాయంతో భార్య విజయలక్ష్మీ రూ.3 లక్షలు సమకూర్చారనేది మరో సమాచారం. నలుగురు వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నగదు వారికి ఎలా సమకూరిందీ తెలుసుకునేందుకు ఆదాయ పన్నుల శాఖ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. 

Pavithra Gowda Darshan


పవిత్రాగౌడ- రేణుకాస్వామి మధ్య సాగిన సెల్‌ఫోన్‌ మెసేజ్‌లను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెసేజ్‌లకు పవిత్ర ఆగ్రహించి, హత్య చేయించిందని చెబుతున్నా.. స్వామి సెల్‌ఫోన్‌ ఇంకా లభించనేలేదు. ఆయనను ఎలా హతమార్చిందీ మరో నిందితుడు వినయ్‌ తన సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేశాడని అనుమానిస్తున్నా.. ఆ వివరాలను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

Pavithra Gowda Darshan


మరోవైపు రేణుకాస్వామి హత్య అనంతరం అతడి మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.50లక్షల వరకు దర్శన్‌ ఖర్చు పెట్టినట్లు సమాచారం. మొత్తంగా కిడ్నాప్‌, హత్య వ్యవహారాన్ని చూసుకున్న ప్రదోష్‌ అనే వ్యక్తికి రూ.30లక్షలు, నేరాన్ని అంగీకరించేందుకు మరో ఇద్దరికి రూ.5లక్షల చొప్పున దర్శన్‌ చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Pavithra Gowda Darshan


హత్య జరిగిన రోజు దర్శన్, పవిత్ర  చెప్పులతో పాటు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, దర్వన్ పోలీస్ కస్టడీని గురువారం రెండు రోజులు పొడగించారు. 

Pavithra Gowda Darshan

రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేయగా 28 ప్రదేశాల్లో వారిని మహజరు చేసిన అధికారులు 139కీ పైగా సాక్ష్యాలను సేకరించారు. ఈ సంఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితులకు కొందరు సహాయపడేందుకు ప్రయత్నించారు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి రహస్యంగా సహకరించారని అధికారులు ఇలా ఎవరెవరు సహకరించిందీ తెలుసుకునేందుకు కథానాయకుడు దర్శన్‌తో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా విచారిస్తున్నారు.

click me!