రామోజీరావు, రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ మీటింగ్, పెద్ద స్కెచ్ వేసినా తుస్సుమంది

First Published Jun 22, 2024, 1:32 PM IST

ఆపై తాను కాలమిస్టునని చెప్పుకుంటూ రామోజీరావు వద్దకు వెళ్లి, మనసులోని మాటను చెప్పారు.

Ramoji rao, RGV


ఇటీవలే స్వర్గస్దులైన  రామోజీరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. స్వయం కృషి తో ఎదిగి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. అదే విధంగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించి ఇండియన్ సినీ పరిశ్రమకే ఒక ది క్సుచి లా ఉన్నారు.  ఓ టైమ్ లో ఆయన బ్యానర్ లో సినిమా చేయాలని, సీనియర్ దర్శకులు మాత్రమే కాకుండా కొత్త దర్శకులు సైతం తహతహలాడేవారు. టాలెంట్ ఎక్కడున్నా ఇట్టే పసిగట్టి ప్రోత్సహించేవారు. ఈ క్రమంలోనే ఆయన ఉషాకిరణ్ బ్యానర్ లో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలనుకున్నారు. అందుకోసం పెద్ద స్కెచ్చే వేసారు. విషయం పాతదే అయినా ఆయన సంస్మరణ సమయంలో ఆయన గురించిన విశేషాలు ఆసక్తికరంగా జనం మాట్లాడుకుంటున్నారు. 


రామ్ గోపాల్ వర్మ తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్పటికే 'శ్రీవారికి ప్రేమ లేఖ', 'మయూరి', 'ప్రతిఘటన' వంటి హిట్ చిత్రాలతో జోరు మీదున్న రామోజీరావును కలిస్తే,   బెస్ట్ చాన్స్ లు ఉంటాయని భావించారు. అయితే, ఆయన్ను ఎలా కలవాలో తెలియలేదు. దీంతో ఓ ప్లాన్  చేశాను. ఆయన నడుపుతున్న ఆంగ్ల దినపత్రిక 'న్యూస్ టైమ్'లో 'ది ఐడియా దట్ కిల్డ్ 50 మిలియన్ పీపుల్' అన్న పేరుతో ఓ ఆర్టికల్ రాశారు. అది ప్రచురితమైంది. 

Latest Videos



ఆపై తాను కాలమిస్టునని చెప్పుకుంటూ రామోజీరావు వద్దకు వెళ్లి, మనసులోని మాటను చెప్పారు. కానీ తాను అనుకున్నది జరగలేదు. దర్శకుడికి ఇమాజినేషన్ ఉండాలని, ఆయన కింద పనిచేసే సాంకేతిక నిపుణులకు అనుభవం ఉంటే చాలని చెప్పిన వర్మ మాటలను ఆయన అంగీకరించలేదు. తన  వాదనను తోసిపుచ్చుతూ, కావాలంటే తన పేపర్ లో కాలమిస్టుగా ఉద్యోగం ఇస్తానని చెప్పారు. 

Ramo Rao Dead


రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై మాట్లాడుతూ.... ఏదిఏమైనా తొలిసారిగా నా పేరును పేపర్ పై చూసి స్నేహితులు, బంధువులు థ్రిల్ ఫీలయ్యారు" అన్నారు. ఆ ఆర్డికల్ ఉన్న పేపర్ ను తాను పోగొట్టుకున్నానని,  రాజా అనే తన స్నేహితుడు దాన్ని తెచ్చి ఇచ్చాడని చెప్పారు.
 


ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, మీడియా మొఘల్ రామోజీ రావు మృతికి  పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా అనేక మంది మూవీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. అలాగే రామోజీ రావు మరణం నమ్మశక్యం కాదని, ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక సంస్థగా రూపాంతరం చెందారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆయన మనిషి కాదని, శక్తి అని కొనియాడారు. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు.


ఇక రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ, అంతం, క్షణం క్షణం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు , అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు.  


ఇంజనీరింగ్‌ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట.


 ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్‌లు రెంట్‌కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్‌ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. 


ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్‌ చిత్రాల్లో సత్య ఒకటి.  తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు,  సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు.  ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్‌ దేవగన్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. 


ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్‌ చిత్రాల్లో సత్య ఒకటి.  తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు,  సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు.  ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్‌ దేవగన్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. 

click me!