తమిళ సినిమాకు 1000 కోట్ల వసూళ్లు అందని ద్రాక్షలాగే ఉంది. స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా.. 100 కోట్ల వసూళ్ళు సాధించే సినిమాలు చేయలేకపోతున్నారు. ఇక కోలీవుడ్ లో ఒక ఏడాదిలో 900 కోట్ల వసూళ్లు సాధించిన హీరో గురించి తెలుసుకుందాం.
1000 కోట్ల వసూళ్లు టాలీవుడ్ సినిమాలకు కామన్ గా మారాయి. టాలీవుడ్ తరువాత బాలీవుడ్, కన్నడ పరిశ్రమ కూడా 1000 కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. కాని తమిళ సినిమా పరిశ్రమకు మాత్రం 1000 కోట్ల కలెక్షన్లు అందని ద్రాక్షే. ఇక్కడ స్టార్ హీరోలు ఉన్నా, ఆ వసూళ్లు ఇంకా సాధ్యం కాలేదు. ఇతర భాషా నటుల్లా ఇక్కడి నటులు ప్రమోషన్‌లలో పూర్తిగా పాల్గొనకపోవడం కూడా ఒక కారణం. సినిమా ప్రమోషన్ కోసం తమిళనాడు దాటి రాబోమని కొందరు, ప్రమోషన్‌కే రాబోమని మరికొందరు మొండికేస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో ఒకే సంవత్సరంలో 900 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన హీరో గురించి చూద్దాం. ఆయన ఎవరో కాదు, తలపతి విజయ్. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ అని పిలువబడే విజయ్ నటించిన రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదలై 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ ఘనతను రజనీ, కమల్, అజిత్ వంటి నటులు ఇప్పటివరకు సాధించలేదు.
2023 సంవత్సరంలో తలపతి విజయ్ ఈ ఘనత సాధించారు. ఆ సంవత్సరం ఆయన నటించిన వారసుడు, లియో సినిమాలు విడుదలయ్యాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించిన వారసుడు 2023 సంక్రాంతికి విడుదలైంది. పక్కా కమర్షియల్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం 310 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన నటించిన లియో అక్టోబర్‌లో విడుదలైంది.
పాన్ ఇండియా సినిమాగా విడుదలైన లియో 620 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. 2023లో విజయ్ నటించిన ఈ రెండు సినిమాల మొత్తం వసూళ్లు 900 కోట్లు. 2018లో 2.0 సినిమా 800 కోట్లు వసూలు చేయడం ద్వారా ఒకే సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా రజనీకాంత్ ఉన్నారు. ఆ రికార్డును బద్దలు కొట్టి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కింగ్‌గా విజయ్ ఉన్నారు.