vijay deverakonda
Vijay Deverakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటుడిగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిన హీరో. `పెళ్ళి చూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` సినిమాలతో ఆయన రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత ఆ రేంజ్ విజయాలు పడలేదు. వరుసగా నాలుగు సినిమాలు బోల్తా కొట్టాయి. `ఖుషి` రిలీఫ్‌నివ్వగా, `ఫ్యామిలీ స్టార్` మూవీ డిజప్పాయింట్ చేసింది.
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)
ఇప్పుడు భారీ లైనప్‌తో ఉన్నారు విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన జాతీయ స్థాయి ఈవెంట్‌లో పాల్గొన్నారు. టీవీ9 గ్రూప్ నిర్వహించిన `వాట్ ఇండియా థింక్ టుడే`(విట్-2025) సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆయన ఇండియన్ సినిమా గురించి మాట్లాడారు.
సినిమాల్లో వస్తున్న మార్పులు, ఏఐ టెక్నాలజీ, ప్రాంతీయ భాషలుగా ఉన్న సినిమా ఒక్కటి కాబోతుందని, లాంగ్వేజ్ బారియర్స్ లేవని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర, షాకింగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు.
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)
టాలీవుడ్ ఒకప్పుడు ఆడియెన్స్ రీచ్ కోసం స్ట్రగుల్ అయ్యిందన్నారు. `బాహుబలి` సినిమా సమయంలో టాలీవుడ్ ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసిందన్నారు. రాజమౌళి, ప్రభాస్, రాజా వంటి స్టార్ట్ ఎంతో కష్టపడి ఆ మూవీని తెరకెక్కించారు. మార్కెట్‌ని మించి ఖర్చు చేశారు. దీంతో ఓ దశలో ఆడియెన్స్ రీచ్ కోసం స్ట్రగుల్ అయ్యారు.
కానీ `బాహుబలి` సక్సెస్ కొత్త మార్కెట్‌ని ఏర్పాటు చేసి, ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని, లాంగ్వేజ్ బారియర్స్ ని బ్రేక్ చేసిందన్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీగా ఎదిగిందని, ఇప్పుడు అంతా సౌత్ సినిమాని చూడటం కోసం వెయిట్ చేస్తున్నారని, అందులో తాను భాగం కావడం గర్వంగా ఉందన్నారు.
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)
ఆరేడు ఏళ్ల క్రితం విజయ్ దేవరకొండ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశమంతా తెలుసు. ఇదంతా సినిమా, ఆడియెన్స్ ప్రేమ వల్లే సాధమైంది. కష్టపడుతూ మనం ఏంటో నిరూపించుకున్నప్పుడు,
మన ప్రయత్నం జెన్యూన్ గా ఉన్నప్పుడు ఆడియెన్స్ ప్రేమిస్తారని, తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారని, అందుకు తానే ఉదాహరణ అని అన్నారు. ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే అదే కారణమని చెప్పారు.
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)
ఈ క్రమంలో బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్ చేశారు. ఏదైనా ఒక సర్కిల్‌లాగా నడుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండియన్ మూవీని లీడ్ చేసిందని, కానీ ఇప్పుడు స్ట్రగుల్ అవుతుందన్నారు. బాలీవుడ్‌లో కొత్త టాలెంట్ రావాలి, కొత్త ఆలోచనలు రావాలి. నార్త్ లో ఉన్న టాలెంటెడ్ మేకర్స్ బాలీవుడ్‌కి రావాలి, తమ కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో సినిమా తీస్తే బాలీవుడ్ మారిపోతుంది.
మున్ముందు టాలీవుడ్‌ని దాటి ముందుకెళ్తుందన్నారు విజయ్. ఒకప్పుడు హిందీ సినిమా ప్రభావం ఎక్కువగా ఉందని, ఇప్పుడు తెలుగు సినిమా లీడ్ చేస్తుందని, రేపొద్దున మరో భాష సినిమాలు రావచ్చు, మళ్లీ బాలీవుడ్ పుంజుకునే అవకాశం ఉంది. ఇలా అంతా ఒక సైకిల్ లాగా జరుగుతుందని చెప్పారు విజయ్ దేవరకొండ.
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)
విజయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సమ్మిట్‌తో విజయ్ రేంజ్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇందులో మిగిలిన వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఆయా రంగంలో మార్పులు, ప్రస్తుత జనరేషన్ ఏం ఆలోచిస్తుందనేది తెలిపారు.
వారితో విజయ్ స్టేజ్ షేర్ చేసుకోవడం విశేషం. అంతేకాదు, ఇందులో వారంతా ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో వైరల్ అవుతుంది.
read more: విజయ్ దేవరకొండకి హీరోయిన్ దొరికింది.. చిరు దెబ్బకి రెండేళ్లు దూరమై ఇప్పుడు కమ్ బాక్?