లైగర్ న్యూడ్ పిక్ తో విజయ్, రష్మిక రిలేషన్ కంఫర్మ్ ? ప్రేయసిని ముద్దుగా పిలుస్తూ ప్రామిస్ చేసిన రౌడీ హీరో..

First Published Jul 3, 2022, 7:08 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్' చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్' చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రిలీజ్ కి ముందే ఈ చిత్రం అనేక విశేషాలతో ఆసక్తి పెంచుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి స్టయిల్ లో ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రోల్ బోల్డ్ గా ఉండబోతోంది. 

శనివారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన లైగర్ పోస్టర్ ఇండియా మొత్తం సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది.  ఈ పోస్టర్ లో వైల్డ్ గా విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో సెక్సియెస్ట్ పోస్టర్ ఎవర్ అంటూ ట్రెండింగ్ మొదలైంది. 

అభిమానులు మాత్రమే కాదు.. స్టార్ హీరోయిన్లు సెలెబ్రిటీలు సైతం విజయ్ బోల్డ్ లుక్ కి ఫిదా అయిపోయారు. సమంత, పూజా హెగ్డే, రష్మిక, తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్లు విజయ్ బోల్డ్ అవతారంని ప్రశంసిస్తూ పోస్ట్ లు పెట్టారు. 

ఇందులో రష్మిక మందన చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండని ఏకంగా తన ఇన్సిపిరేషన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. ఆల్రెడీ వీరిద్దరిపై చాలా రూమర్స్ ఉన్నాయి. లైగర్ న్యూడ్ పిక్ తో వీళ్ళ రిలేషన్ కంఫర్మ్ అయినట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. 

రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లయ్ ఇచ్చిన విధానం చూస్తే తప్పకుండా ఈ హాట్ కపుల్ రిలేషన్ లో ఘాటు ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు అర్థం అవుతోంది. రష్మికని విజయ్ దేవరకొండ ముద్దుగా రుషీ అని సంభోదించాడు. 'రుషీ.. గీత గోవిందం నుంచి నువ్వే నా వర్కౌట్ మోటివేషన్. ఈ ప్రపంచం తప్పకుండా చూస్తుంది.. ఇది నా ప్రామిస్.. బిగ్ లవ్' అంటూ లవ్ ఎమోజిలు పెట్టాడు. 

గత ఏడాది నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక కలసి చేస్తున్న వర్కౌట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీళ్ళ జిమ్ పార్ట్నర్ అయిన సాయి కేతన్ అనే బుల్లితెర నటుడు రష్మిక, విజయ్ ల వర్కౌట్ పిక్స్ మరోసారి పోస్ట్ చేశాడు. మై బేబీస్ అంటూ 'విరోష్' అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. 

విజయ్ రష్మిక లని కలిపి ఇలా విరోష్ చేశాడు. అనుష్క, విరాట్ విరుష్క తరహాలో అన్నమాట. నయన్, విగ్నేష్ లపై అభిమానులు విక్కీ నయన్ అనే ట్యాగ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెలెబ్రిటీల జంటల బాటలోనే రష్మిక, విజయ్ దేవరకొండ పయనిస్తున్నారని అర్థం అవుతోంది. 

click me!