ఈరోజు ఎపిసోడ్ లో వేద ఒకటికి పది సార్లు ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు అనుమతి ఇస్తే నేను ఈ కేసు వాపస్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు లాయర్ ఝాన్సీ వేద ఏం జరిగింది అని అనగా అందరూ నన్ను క్షమించండి. ఎందుకు, ఏమిటి,ఎలా ఇలాంటి ప్రశ్నలు ఏవి అని ప్రశ్నించకండి అని చేతులు జోడించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. మరొకవైపు అభిమన్యు మందు తాగుతూ ఉండగా ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి చాలు బ్రో మరీ ఎక్కువ తాగేస్తున్నావు అని అనగా ఎంత తాగినా ఎక్కడం లేదు అని అంటాడు అభిమన్యు.