Malli: తానే మల్లీ వాళ్ళ నాన్న అని ఒప్పుకున్న శరత్.. షాక్ లో వసుంధర?

First Published Feb 3, 2023, 1:24 PM IST

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 3వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో  మాలిని నెక్స్ట్ వారం మా ఫ్రెండ్ పెళ్లి ఉంది అందుకే నేను అరవింద్ షాపింగ్ కి వెళ్తున్నాము లేకపోతే నీ ఇంటర్వ్యూ కి వచ్చేవాళ్ళం మల్లీ అంటుంది మాలిని. అప్పుడు అరవింద్ వల్ల పెదనాన్న అదేంటమ్మా  మల్లీని ఇంటర్వ్యూకి పోల్చుకొని వెళ్తుంది అరవింద్ అలాగే ఇంటర్వ్యూ చేసే వాళ్ళుగా అరవింద్ కూడా ఒకడు అనడంతో మాలిని షాక్ అవుతుంది. అప్పుడు ఇంట్లో అందరూ మళ్లీకి ఆల్ ద బెస్ట్ చెప్తారు. అప్పుడు మల్లీ,  అరవింద్ అక్కడి నుంచి వెళ్తుండగా మాలిని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఇంటర్వ్యూ కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు.
 

ఆ తర్వాత మల్లీ, అరవింద్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ దగ్గరికి వస్తారు. ఎన్నిసార్లు చెప్పాలి మల్లీ నువ్వు మౌనంగా ఉండదు నువ్వు మౌనంగా ఉంటే ఏదో ఒక తింగరి పనిచేస్తావు అనడంతో అవును బాబు గారు నాకు టెన్షన్ గా ఉంది. అక్కడ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది బాబు గారు ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి నువ్వేం చెప్పినా నేను ఫస్ట్ వెళ్దాం పద అని అంటాడు అరవింద్. అప్పుడు అరవింద్, మల్లీ కి ధైర్యం చెప్పి ఇంటర్వ్యూ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. ఇప్పుడు మల్లీ కి ఇంటర్వ్యూ వాళ్ళు ఘనంగా స్వాగతం పలుకుతారు.
 

అప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్టులో మల్లీ అరవింద్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మాలిని వాళ్లు అలాగే శరత్ ,వసుంధర వాళ్ళు మల్లీ ఇంటర్వ్యూ ని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న రిపోర్టర్ అరవింద్ గురించి ఆలోచిస్తూ ఉండగా నువ్వు అంతగా ఆలోచించాల్సిన పనిలేదు రావాలనిపించింది వచ్చాను అంటాడు అరవింద్. అప్పుడు అరవింద్ వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. అప్పుడు ఇంటర్వ్యూలో అందరూ తొందర తొందరగా ఇంగ్లీషులో ప్రశ్నలు అడగడంతో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లీ అరవింద్ ను చూసి  ధైర్యం తెచ్చుకొని ఆనంద పడుతూ సమాధానాలు చెబుతూ ఉంటుంది.
 

తెలుగులో మాట్లాడతారా అని  మల్లీ అనడంతో అప్పుడు మళ్లీ మాటలు విన్నా అరవింద్ ఫ్యామిలీ సంతోషపడుతూ మల్లీనీ పొగుడుతూ ఉంటారు. అప్పుడు అరవింద్ మల్లీని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడు మల్లీ ధైర్యంగా అరవింద్ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. మల్లీ మాటలు విని అరవిందు ఫ్యామిలీ అలాగే మాలిని ఫ్యామిలీ వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు మల్లీ ధైర్యంగా ఇంటర్వ్యూలో అందర్నీ ప్రోత్సహించాలి అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఒక రిపోర్టర్ మీ ఇంట్లో టీవీ ఉంటుందా అని అడగగా టీవీనే కాదు రేడియో కూడా ఉండదు అంటుంది మల్లి. మీ అమ్మగారు మీకు చదువు చెప్పేవారా అనడంతో మా అమ్మ ఏమి చదువుకోలేదు.

కానీ నన్ను చదివించడం కోసం మా అమ్మ ప్రతి ఒక్కరిని ఎదిరించింది అంటూ మీరా గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది మల్లీ. మా అమ్మ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అంటుంది మల్లీ. అప్పుడు మల్లీ మాటలకు ఇంట్లోనే వారు కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు శరత్ మల్లీ ఇంటర్వ్యూ చూస్తుండగా ఇంతలో వసుంధర అక్కడికి వచ్చి మల్లీ ఇంటర్వ్యూ చూస్తున్నందుకు చాలా ఆనంద పడుతున్నారు అని అనడంతో నువ్వు వచ్చావు కదా ఇంక నా ఆనందం ఎక్కడ ఉంటుంది నీకు దూరంగానే ఉంటే బెటర్ అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు శరత్. మరోవైపు మల్లీ ఏర్పాటు చేసిన రిపోర్టర్ లేచి మల్లీని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇప్పటివరకు మీరు మీ అమ్మగారు గురించి మాత్రమే చెప్పారు ఇప్పుడు మీ నాన్న గురించి చెప్పండి అనడంతో మల్లీ ఆలోచనలో పడుతుంది.
 

ఆ మాటలకు వసుంధర సంతోష పడుతూ ఉంటుంది. అరవింద్ ఫ్యామిలీ మొత్తం ఆలోచనలో పడతారు. మీ నాన్న గురించి చెప్పండి మీ విజయంలో మీ నాన్నగారి పాత్ర కూడా ఉందా మా అందరికీ ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది అంటూ మల్లీ వాళ్ళ నాన్న గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఏమైంది మల్లీ గారు ఎందుకు మాట్లాడటం లేదు నేను ఐఏఎస్ కోసం అడగలేదు కదా మీ నాన్నగారి గురించి అడిగాను అని అంటాడు. ఆ  మాటలకు అరవింద్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మల్లీ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నీకంటూ నాన్న లేడా మీ నాన్న ఇక్కడ ఉన్నాడు లేదా మీ అమ్మ నాన్న కలిసి లేదా అంటూ మల్లీ నీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.
 

చూశారా మల్లీకి వాళ్ళ నాన్న ఎవరో తెలియదంట అని అంటాడు. ఇప్పుడు శరత్ నేనే వాళ్ళ నాన్నని అని అక్కడికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. శరత్ ని టీవీ లో చూసి ఫ్యామిలీ వసుంధర వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. వసుంధర ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటుంది. అప్పుడు మామయ్యకు ఏమయ్యింది మీడియా ముందు నాన్నను అని చెబుతున్నాడు అనుకుంటూ ఉంటాడు అరవింద్. అప్పుడు స్టేజ్ పైకి వచ్చిన శరత్ చెప్పు మల్లీ నేనే మీ నాన్నని అన్న నిజం అందరికీ చెప్పు అనడంతో మల్లీ తో పాటు అందరూ షాక్ అవుతారు. అప్పుడు మీరు మల్లీ ఫాదరా అని అతను అడగడంతో జ్ఞాని అని అంటాడు. అజ్ఞాని అని పెట్టుకో అని అతనిపై సీరియస్ అవుతాడు.
 

ఈ ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేశారు మల్లీ నీ ఇంటర్వ్యూ చేసి మల్లీ లాంటి ఎంతోమంది అమ్మాయిలకు ప్రోత్సాహం ఇవ్వడానికి కదా మరి ఇంటర్వ్యూ ఎందుకు కనెక్ట్ చేశారు ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడుగుతున్నారు అని సీరియస్ అవుతాడు శరత్ చంద్ర. తప్పుగా ఏమి అడగలేదు కదా సార్ అని అనడంతో మీరు అసలు మాట్లాడకండి కూర్చోండి అని అంటాడు క్షమించండి. మీదే మల్లి గారీ తండ్రి అయితే ఎందుకు మల్లీ గారు నీ పేరు చెప్పడానికి అంత ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతాడు సదర్ రిపోర్టర్.   నేనే మల్లీ వాళ్ళ తండ్రిని అన్న నిజం మల్లీ ఇక తెలియదు కాబట్టి చెప్పడానికి ఆలోచిస్తుంది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు

click me!