Intinti Gruhalakshmi: మళ్లీ ఒకటైన లాస్య, నందు.. సంతోషంలో తులసి?

First Published Dec 9, 2022, 10:23 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో తులసి, నందు ఇద్దరు లాస్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి లాస్యకి దూకుడు ఎక్కువ అహంకారం ఎక్కువ పొగరు ఎక్కువ ఇవన్నీ తెలిసే మీరు లాస్యని ప్రేమించారు అని అంటుంది. ఒప్పుకుంటాను కానీ నేను ఇంటి విషయంలో నన్ను మోసం చేసిన తర్వాతనే మారిపోయాను అని అంటాడు నందు. కేవలం అభద్రతతో అలా చేశాను అని చెప్పింది కదా అనడంతో అభద్రత అన్నది కేవలం తన భయం కాదు తన అలవాటు ఎప్పటికీ తగ్గదు అని అంటాడు నందు. తన ప్రశాంతంగా బతకదు వేరే వాళ్ళని ప్రశాంతంగా బతికనివ్వదు ఇలా ఎన్నాళ్ళని భరించాలి అని అంటాడు నందు. తనకోసం ఎన్నో చేశాను నిన్ను కూడా వదిలేసాను అమ్మ నాన్నలకు కోపం తెప్పించాను.
 

నా కొడుకుల ముందు హీరోలా ఉండేవాన్ని జీరో అయిపోయాను నలుగురిలో నవ్వుల పాలయ్యాను అని బాధతో మాట్లాడతాడు నందు. అప్పుడు నందు ఎందుకు తులసి మా బంధం గురించి అంతగా వెంపర్లాడుతున్నావు అని అనగా ఇంత ఆసక్తి ఓపిక నాకు లేదు నందగోపాల్ గారు, మీరు కొట్లాడండి పెట్టుకోండి కానీ బంధం విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కోపంలో మాత్రం తీసుకోవద్దు అని అంటుంది తులసి. నేను చెప్పదల్చుకున్నది ఇదే అని అనగా అప్పుడు నందు నన్ను అర్థం చేసుకోదు అని అనడంతో అర్థమయ్యే వరకు చెప్పాలి మీరు పరాయి వారు కాదు లాస్య భర్త అని అంటుంది తులసి. అప్పుడు తులసి మాటలకు ఆలోచనలో పడతాడు నందు.

 అప్పుడు తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నా మీద కోపంగా ఉందా అని తులసి అనడంతో లేదు తులసి ఇన్ని రోజులు కుటుంబం కోసం బాధపడ్డావు తపన పడ్డావు. నువ్వు ఈ ఇంటికి దూరంగా వెళ్లిన ఈ ఇంటి సమస్యలు నేను వదలడం లేదు సారి తప్పయింది అని అంటాడు నందు. అలాగే ఇంకొకసారి నువ్వు ఇంటికి వస్తే పిల్లలతో ఆనందంగా గడపడానికి మాత్రమే వస్తావు అందుకు నేను మాట ఇస్తున్నాను అనడంతో తులసి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు లాస్య తన రూమ్ లో ఒంటరిగా కూర్చొని తులసి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే నందు అక్కడికి వస్తాడు. అప్పుడు నందు గదిలో సామాన్లు అన్ని సర్దిపెట్టి తప్పుఒప్పుల గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు అనగా వెంటనే లాస్య నేను మారతానని నువ్వు అనుకుంటున్నావు కదా నేను నీ దగ్గరికి రావచ్చు కదా అని నందుని హగ్ చేసుకుంటుంది లాస్య.
 

 అప్పుడు నందు తులసి అన్న మాటల గురించి ఆలోచించుకుంటూ లాస్యని ఓదార్పుస్తాడు. అప్పుడు నందు నువ్వు ఇప్పటినుంచి ఒక పని చేయాలి ఇంట్లో వాళ్ళందరితో బాగా కలిసిపోవాలి అని అనగా వెంటనే లాస్య మళ్లీ తులసి మీద ఇప్పుడు ప్రేమ ఎందుకు వస్తుందో అనుకుంటూ ఉంటుంది. కావాల్సింది ఇంట్లో ప్రశాంతత సంతోషంగా ఉండడం తులసి చేసింది అదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. అప్పుడు లాస్య నేను నిన్ను తగ్గించుకోవడానికి తగ్గాను తప్పితే లాస్య ఎప్పటికీ తగ్గదు ఎవరికి భయపడదు అని మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుతుంది లాస్య. మరొక వైపు తులసి తన గురించి తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి బుక్స్ సర్దుతూ ఉండగా తన డైరీ బయటపడడంతో డైరీ ని తీసుకొని వెళ్లి బయట కూర్చుని చదువుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
 

నా జీవితంలో ఆశలు తీరుతాయో లేదో తీరని ఆశలు అన్నీ ఒక చోట రాసుకుంటున్నాను అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది తులసి. ఆ తర్వాత తులసి తన డైరీలో తీరని ఆశలు అని రాసుకున్న ఒక్కొక్కటి చదువుతూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. ఇప్పుడు తనని సామ్రాట్ వైజాగ్ బీచ్ కి తీసుకెళ్లిన విషయం ఫ్లైట్లో తీసుకెళ్లిన విషయం గురించి ఆలోచిస్తూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఆ విషయాన్ని తలుచుకుంటూ వాళ్ళ అమ్మ గుర్తుకు రావడంతో వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతుంది తులసి. ఏం చేస్తున్నావు అని అడగగా జీవితం గురించి ఆలోచిస్తున్నాను అమ్మ అని అంటుంది తులసి. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ నా వయసులో నేను మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటుంది.
 

 అప్పుడు తులసి వాళ్ళ అమ్మ నిన్ను కన్నాను కానీ నీకు మంచి జీవితం ఇవ్వలేకపోయానని బాధగా ఉంది అనడంతో వెంటనే తులసి బిడ్డల్ని కంటాము కానీ వారి తలరాతలని కనులేమని నువ్వే అంటావు కదా అమ్మ అని అంటుంది తులసి. చూడాలని ఉంది నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలని ఉంది అనడంతో నేను రావాలా అని అనగా వద్దమ్మా నేనే రేపు ఉదయం వస్తాను అని అంటుంది తులసి. మరొకవైపు సామ్రాట్ హనీ కోసం వెతుకుతూ ఉండగా హనీ ఒకచోట కూర్చుని ఉంటుంది. అప్పుడు సామ్రాట్ ఎంత మాట్లాడినా హనీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.

ఇప్పుడు హనీ నా మనసు బాధగా ఉంది నా సంతోషం మీ సంతోషమే కదా నాన్న అని నవ్వితే నువ్వు నవ్వినట్టే కదా అనగా అవును తల్లి అని అంటాడు సామ్రాట్. అప్పుడు మళ్లీ కూతురు అడిగింది కాదనవు కదా అనడంతో ఏం కావాలో చెప్పు చిటికెలో తెచ్చి పెడతాను అని అంటాడు సామ్రాట్. ఇప్పుడు సామ్రాట్ తో మాట తీసుకుంటుంది హనీ. ఇప్పుడు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంకు రావాలి అనడంతో అది నేను ఎలా తెస్తాను అమ్మ నువ్వు తెచ్చుకోవాలి కదా అని అనగా మాట ఇచ్చావు మర్చిపోవద్దు అని అంటుంది హనీ. అప్పుడు హనీ ప్రతిసారి సెకండ్ ర్యాంక్ వస్తున్నాను ఫస్ట్ రావాలి అని అంటుంది.

click me!