Intinti Gruhalakshmi: నందుకి సలహా ఇచ్చిన తులసి.. కోపంతో రగిలిపోతున్న లాస్య?

First Published Feb 2, 2023, 10:11 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో తులసి నందు చేతికి రక్తం రావడం చూసి అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు మైండ్ ఉండి పనిచేస్తున్న లేక చేస్తున్నారా ఎవరి సానుబూతి కోసం ఇలా చేస్తున్నారు అని నందు మీద సీరియస్ అవుతుంది. అప్పుడు నందు అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా ఆగండి నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అనడంతో నీకు నా చేతి నుంచి కారే రక్తం మాత్రమే కనిపిస్తోంది గుండె నుండి కారే రక్తం మాత్రం కనిపించడం లేదు అంటాడు నందు. అప్పుడు తులసి కర్చీప్ తీసుకొని వచ్చి నందుకు చేతికి కట్టు కడుతుంది. అప్పుడు నందు వదిలేయ్ తులసి నన్ను విసిగించకు అని అంటాడు. అప్పుడు తులసి మీకు నేను ప్రేమతో కట్టు కట్టడం లేదు మన మధ్య ఎటువంటి బంధము లేదు మీ చేతికి ఏమైతే నాకేంటి అని అంటుంది.

మీరు నా తోటి మనిషి కాబట్టి అడుగుతున్నాను చెప్పండి అంటుంది తులసి. అప్పుడు లాస్యని పిలుచుకుని వస్తాను అని తులసి వెళ్తుండగా తులసిని ఆపి నాకంతా అయోమయంగా ఉంది ఏం జరుగుతుందో తెలియడం లేదు అనడంతో మీరు కావాలని ఇలా చేస్తున్నారు కన్న తండ్రి మీరే ఇలా చేస్తే పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటుంది తులసి. వాళ్లకి నాకు ఏ సంబంధం ఉంది అని అనడంతో ఇప్పుడు మీ అసలు బుద్ధి బయటపడింది సహాయం చేస్తేనే పిల్లలు అవుతారా లేకపోతే నీ పిల్లలు కాదా అనడంతో నందు తలదించుకుంటాడు. తర్వాత మీరు పిల్లలకి ఏమైనా ఇచ్చారా అనడంతో నందు ఆలోచనలో పడతాడు.

మీరు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు నిన్ను తండ్రిగా భావించి నాన్న అని పిలుస్తున్నారు అని అంటుంది తులసి. అప్పుడు తులసి నందుకి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అప్పుడు తులసి నందుకి ఐడియా ఇస్తూ మీకు చేతనయినంతలో పనిచేసుకోండి. కెఫే పెట్టారు కదా మరొకసారి కేఫె ప్రారంభించండి అని సలహా ఇస్తుంది. అప్పుడు సరిగ్గా ఆలోచించండి అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా లాస్య ఎదురుపడుతుంది.  అప్పుడు లాస్య ఇంకా సలహాలు ఇవ్వడం ఆపలేదా అనగానే నీకు ఇవ్వలేదు కదా అనడంతో నందుని నాశనం చేయాలని చూస్తున్నావు అనడంతో అదే మాట వెళ్లి నీ భర్తకు చెప్పు నాకు అడ్డుపడకు అంటుంది తులసి.

అప్పుడు లాస్యకు బుద్ధి చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ ఒక చోట కూర్చొని ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి నేను కేఫ్ పెడుతున్నాను అని అంటాడు. అప్పుడు అనసూయ మంచిదే కానీ కేఫ్ పెట్టాలి అంటే డబ్బులు ఉండాలి కదా అనగా అప్పుడు అభి కూడా స్థలానికి ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయాలి అని అంటాడు. అప్పుడు అందరు స్థలం గురించి ఆలోచిస్తున్నారు కదా ప్రేమ్ కి తాతయ్య ఇచ్చిన స్థలంలో స్టూడియో పెట్టుకోగా కొంచెం ప్లేస్ మిగులుతుంది. అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అనడంతో అందరూ ఓకే అనడంతో నందు కూడా నవ్వుతూ ఓకే అని అంటాడు. నాకు ఈ ఆలోచన రాలేదే అని నందు అనడంతో అందుకే మేము తులసి సలహాలు పాటించేది అనగా లాస్య నాకు ఈ ప్రపోజల్ నచ్చలేదు అని అంటుంది.
 

అప్పుడు నీ ప్రొఫెషన్ ఏంటి నువ్వు ఎందుకు కేఫ్ పెట్టాలనుకుంటున్నావు అంటూ లాస్య నందుపై అరుస్తుంది. నన్ను ఆపకు లాస్య నేను అన్ని ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను నా వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటాడు నందు. ఎంతకాలమని ఇలాగే సైలెంట్ గా ఉండాలి. ఎంత కాలమని ఇలా పని లేకుండా ఉండాలి అంటాడు నందు. అయినా కూడా లాస్య అలాగే మాట్లాడుతూ వద్దు నందు నా మాట విను అని అంటుంది. ఆలోచించుకో అని లాస్య అనడంతో ఆలోచించుకోవడానికి ఏమీ లేదు ఇదే ఫైనల్ అని అనడంతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమ్ తన గదిలోకి వెళ్లి కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి తులసి వస్తుంది.
 

అప్పుడు తులసి ఎప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి ఆవేశపడకూడదు అనడంతో మరి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నారా అనడంతో తులసి మౌనంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కాదు మీ నాన్న నీ స్టూడియో పక్కన పెట్టుకోవడం ఇష్టం లేదా లేక మీ నాన్న ఇష్టం లేదా అనడంతో సమాధానం నీకు కూడా తెలుసు అమ్మ అని అంటాడు ప్రేమ్. ఆయన నీకు జన్మనిచ్చారు రుణం తీర్చుకునే అవకాశం వస్తే రుణం తీర్చుకోనడంతో నేను నీలాంటి తల్లికి రుణం తీర్చుకుంటాను కానీ నాన్నకు కాదు అంటాడు ప్రేమ్.  నాన్న ఎప్పుడు ఏ విధంగా ఉంటారో ఆయనకే తెలియదు ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటాడు అని ప్రేమ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
 

అప్పుడు అలా మాట్లాడుకు అనడంతో అమ్మ మంచితనం కూడా ఒక హద్దు ఉంటుంది మంచితనం కూడా కొన్నిసార్లు పిచ్చితనం అవుతుంది అంటాడు ప్రేమ్. ఎందుకమ్మా ఎవరికి ఇష్టం లేని పనిని బలవంతంగా జీవిస్తున్నావు అని ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఎందుకంటే ఆయన నా పిల్లలకు తండ్రి కాబట్టి. నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదు కాబట్టి అంటుంది తులసి. ఆయన నీతో విడాకులు తీసుకున్న రోజే నాన్న అన్న బంధాన్ని తెగ తెంపులు చేసుకున్నాం అని చెప్పి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు నందు ఆలోచిస్తూ ఉండగానే బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పరంధామయ్య వాళ్ళు అక్కడికి వచ్చి వాడిని చూస్తే బాధేస్తుంది.
 

 వాడి వెనక ఉన్న భూతం చూస్తే భయమేస్తుంది అందుకే ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంటుంది అనసూయ. అప్పుడు వారిద్దరూ కొడుకు గురించి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే నువ్వు లాస్య దగ్గరికి వెళ్ళు నేను నందుతో మాట్లాడుతాను అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎక్కువగా ఆలోచించి మనసుకి పాడు చేసుకోకు నందు కేఫ్ పెట్టడం పరువు తక్కువ పనేం కాదు అని పరంధామయ్య నందుకు ధైర్యం చెబుతాడు.

click me!