త్రిష ఇంకా చెబుతూ, `పొన్నియిన్ సెల్వన్` గురించి, మణిరత్నం గురించి, గౌతమ్ మీనన్, శరవణన్,ప్రేమ్ వంటి దర్శకులను పొగిడేసింది. వారితో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. `పీఎస్1`లోని కుందవై పాత్రలో నటించిన నేపథ్యంలో ఇప్పటికీ తనని కుందవైగానూ చూస్తున్నారని తెలిపింది. ఈ చిత్రంలో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కావడంతో తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పింది. మరోవైపు ఇప్పుడు `పొన్నియిన్ సెల్వన్ 2` సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం త్రిష `పీఎస్2`తోపాటు `సతురంగ వెట్టై 2`, `రామ్ ః పార్ట్ 1`, `ది రోడ్` చిత్రాలు చేస్తుంది.