ఓటీటీ రైట్స్ లో టాప్‌ 10 సినిమాలు, అత్యధికంగా ఆ స్టార్‌ హీరోవే.. పవన్‌, బన్నీ, తారక్, చరణ్‌ సినిమాలు ఎన్ని?

Published : Jan 20, 2025, 09:45 AM IST

పెద్ద సినిమాలకు ఓటీటీ రైట్స్ చాలా కీలకంగా మారాయి. నిర్మాతలకు బిగ్‌ సపోర్ట్ నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో అత్యధిక రేట్‌కి అమ్ముడుపోయిన టాప్‌ 10 సినిమాలేంటో చూద్దాం.   

PREV
111
ఓటీటీ రైట్స్ లో టాప్‌ 10 సినిమాలు, అత్యధికంగా ఆ స్టార్‌ హీరోవే.. పవన్‌, బన్నీ, తారక్, చరణ్‌ సినిమాలు ఎన్ని?

ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. అదే సమయంలో కలెక్షన్లు చర్చనీయాంశం అవుతుంది. కలెక్షన్ల పోటీ నెలకొంది. దీనికితోడు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతోపాటు ఓటీటీ రైట్స్ కూడా కీలకంగా మారింది.

ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఓటీటీ రైట్స్ రూపంలోనే భారీగా వస్తున్నాయి. ఇవే నిర్మాతలకు కాపాడుతున్నాయి. థియేటర్లో సినిమా ఆడినా, ఆడకపోయినా ఓటీటీ ల నుంచి పెద్ద సినిమాలు భారీగా వసూళ్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇదే ఇప్పుడు చాలా మంది నిర్మాతలను నిలబెడుతుంది కూడా. 
 

211

మరి ఇండియా వైడ్‌గ్‌ అత్యధికంగా ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయిన టాప్‌ 10 సినిమాలు, వాటి ఓటీటీ రేట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో టాప్‌లో డార్లింగ్‌ ప్రభాస్‌ ఉన్నారు. ఆయన నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ ఏకంగా రూ.375కోట్లతో టాప్‌లో ఉంది. అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. ఈ మూవీ సుమారు రూ. 1200కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
 

311

రెండో స్థానంలో కన్నడ స్టార్ యష్‌ ఉన్నారు. ఆయన `కేజీఎఫ్‌ 2`తో కన్నడ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు.  ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ.320కోట్లకు అమ్ముడు పోయాయి. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్‌గా రూ.1200కోట్లు రాబట్టింది. 
 

411

మూడో స్థానంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ఉంది. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ సుమారు రూ.300కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. డిస్నీ హాట్‌ స్టార్‌, నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. 

511

ఇక ఇప్పుడు ఇండియన్‌ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసిన `పుష్ప 2` కూడా టాప్‌ 4లో నిలిచింది. సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ రూ.275కోట్లు సేల్‌ అయ్యాయి. నెట్‌ ఫ్లిక్స్ ఈ రైట్స్ దక్కించుకుంది. ఈ మూవీ కలెక్షన్లు రూ.1900కోట్లకు దగ్గర్లో ఉంది. 

read  more: కొరటాల శివ దర్శకత్వలో అల్లు అర్జున్‌ మూవీ?, బ్యాక్‌ డ్రాప్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. `పుష్ప 2` ఎఫెక్ట్
 

611

ఐదో స్థానంలో ప్రభాస్‌ నటించిన `సలార్‌` నిలిచింది. ప్రశాంత్‌ నీల్ రూపొందించిన ఈ మూవీ రూ.250కోట్లకి ఓటీటీ రైట్స్ అమ్మారు మేకర్స్. ఈరైట్స్ నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సుమారు రూ.700కోట్ల కలెక్షన్లని రాబట్టింది. 

also read: `ఆదిత్య 369` షూటింగ్‌లో నడుము విరగొట్టుకున్న బాలయ్య, కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
 

711

ఆరో స్థానంలో కూడా ప్రభాస్‌ ఉన్నారు. ఆయన నటించిన `ఆదిపురుష్‌` సైతం భారీగా అమ్ముడు పోయింది. ఈ మూవీ కూడా రూ. 250కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయి. ప్రైమ్‌ ఈ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇలా మూడు సినిమాలతో ప్రభాస్‌ టాప్‌లో ఉన్నారు. 

811

ఏడో స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా మూవీ కూడా చేయని పవన్‌.. ప్రస్తుతం నటిస్తున్న `ఓజీ` భారీగా ఓటీటీ రైట్స్ సేల్‌ అయ్యాయి. ఈ మూవీ రూ.200కోట్లు అమ్ముడుపోయిందట. నెట్‌ ఫ్లిక్స్ ఈ రైట్స్ సొంతం చేసుకుంది. సుజీత్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

also read: సీఎంగా పవన్‌ కళ్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్‌, మరి చంద్రబాబు?.. టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వార్?
 

911

ఎనిమిదో స్థానంలో రామ్‌ చరణ్‌ నిలిచారు. ఈ మూవీ రూ.160కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్మేశారట. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ రైట్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై నిరాశ పరిచిన విషయం తెలిసిందే. 

read  more: `గేమ్‌ ఛేంజర్‌` ఫెయిల్యూర్‌ ని రామ్‌ చరణ్‌ ముందే ఊహించాడా? కాలమే సమాధానం చెబుతుందంటూ స్టేట్‌మెంట్‌
 

1011

ఇక తొమ్మిదో స్థానంలో ఎన్టీఆర్‌ `దేవర` నిలిచింది. ఈ సినిమా రూ.150కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్‌ అయ్యాయి. నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సుమారు. రూ.450 నుంచి 500కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. 

read  more:పుష్ప-2 : కేరళలో డిజాస్టర్ కు అసలు కారణం ?

 

1111
thug life

ఇక తొమ్మిదో స్థానంలో ఎన్టీఆర్‌ `దేవర` నిలిచింది. ఈ సినిమా రూ.150కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్‌ అయ్యాయి. నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సుమారు. రూ.450 నుంచి 500కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. 

read  more:`సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?

also read: `ఫతే` మూవీ 10 రోజుల కలెక్షన్లు.. దర్శకుడిగా మారిన సోనూసూద్‌కి గట్టి దెబ్బ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories