అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఇప్పటికే సినిమా రావాల్సి ఉంది. `దేవర` మూవీ కథని ముందుగా అల్లు అర్జున్‌కే చెప్పినట్టు సమాచారం. వీరి కాంబోలో సినిమాని కూడా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇది క్యాన్సిల్ అయ్యింది. ఈ కథనే ఎన్టీఆర్ తో తీసినట్టు మొదట్లో ప్రకటించిన పోస్టర్‌ని బట్టి తెలుస్తుంది.
మొత్తానికి అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ మిస్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ కలవబోతున్నారట. ఇటీవలే ఓ స్క్రిప్ట్ ని అల్లు అర్జున్‌కి నెరేట్ చేశాడట కొరటాల. ఈ మూవీ యూపీ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని, యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంబోతుందని తెలుస్తుంది. రా అండ్ రస్టిక్ కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన `పుష్ప 2` దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే.
ఈమూవీ నార్త్ ఆడియెన్స్ కి బాగా ఎక్కింది. దీంతో ఈ ప్రభావంతోనే యూపీ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథని రాసుకున్నారట కొరటాల శివ. ప్రత్యేకంగా బన్నీ కోసం రాసుకున్న కథ అని తెలుస్తుంది.