
చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ కొడుతోంది మళయాళి చిత్ర పరిశ్రమ. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే సక్సెస్ కు కారణమవుతున్నాయి. ఓటిటిలలోనూ ఈ సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఈ క్రమంలో మలయాళం సినిమా నుంచి వచ్చిన మరో కొత్త చిత్రం “రైఫిల్ క్లబ్” (Rifle Club). ఈ చిత్రం థియేటర్ లో మంచి హిట్టై , ఇప్పుడు ఓటిటిలో దిగింది. ఈ సినిమా చూసిన అందరికీ బాగా నచ్చుతోంది. అసలేముంది ఈ సినిమాలో ?
స్టోరీ లైన్
1991లో జరిగే ఈ కథలో రొమాంటిక్ స్టార్ షాజహాన్ (వినీత్ కుమార్) తన రూట్ మార్చి ఒక యాక్షన్ సినిమా చేయాలనుకుంటాడు. అందుకోసం గన్స్ హ్యాండిల్ చేయాల్సి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడానికి రైఫిల్ క్లబ్ కి వస్తాడు. ఆ క్లబ్ ని కొంతమంది రైఫిల్స్ అంటే ఇంట్రస్ట్ ఉన్న వాళ్లు మైంటైన్ చేస్తూంటారు. వారిలో లోనప్పన్ (విజయ రాఘవన్), అవరన్ (దిలీష్ పోతన్) ప్రధానం. షాజహాన్ ని ఆ క్లబ్ మెంబర్స్ బాగానే రిసీవ్ చేసుకుంటారు. సరదాగా అతనితో కాలక్షేపం చేస్తారు. అయితే అదే సమయంలో అక్కడ జరిగిన ఓ సంఘటన మొత్తం ఆ రాత్రిని రైఫిల్స్ నైట్ గా మార్చేస్తుంది.
మంగుళూరులో గన్స్ డీలర్ అయిన దయానంద్ బారే (అనురాగ్ కశ్యప్). అతని చిన్న కొడుకు ఓ టైప్ తిక్కలోడు. అతను అలీ (రంజాన్ ముహమ్మద్) ల అనే వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ (నవని దేవానంద్) ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో జరిగిన గొడవలో పొరపాటున అతన్ని చంపేస్తుంది ఆ జంట. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కేరళ పారిపోతారు వాళ్లు. అక్కడ వయనాడ్‌లో ఉన్న ఈ రైఫిల్ క్లబ్‌ను ఆశ్రయిస్తుంది. తమ ఆశ్రయం కోరి వచ్చిన వారికి సాయిం చేయాలనుకుంటారు. వారి ప్రాణాలు రక్షించాలనుకుంటారు.
ఇదే సమయంలో దయానంద్ తన గ్యాంగ్ & గన్స్ తీసుకొని రైఫిల్ క్లబ్ కి వచ్చేస్తాడు. ఆ గ్యాంగ్ కి రైఫిల్ క్లబ్ ఎలా ఎదుర్కొంది? క్రూరుడైన దయానంద్‌ను అడ్డుకునే క్రమంలో రైఫిల్ క్లబ్‌కు ఎలాంటి సిట్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి, చివరకు ఏమైంది? అన్నది చిత్ర కథ.
విశ్లేషణ
ఈ చిత్రానికి దర్శకుడు, కెమెరా ఒకడే కావడంతో విజువల్స్ పైనే దృష్టి ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఆషిక్ అబు దర్శకత్వం కంటే ఛాయాగ్రహణం మీదే ఎక్కువ ధ్యాస పెట్టాడని చెప్పాలి. అందువల్ల ప్రతి ఒక్క ఫ్రేమ్, లైటింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో కథ గురించి వెతకటం కన్నా యాక్షన్ బ్లాక్స్ ను ఏ రేంజిలో డిజైన్ చేసారో చూస్తూ కూర్చోవటం మేలు. అందుకే యాక్షన్ సినిమా లవర్స్ కు ఈ సినిమా తెగ నచ్చుతోంది.
యాక్షన్ బ్లాక్స్ ను డిజైన్ చేసిన విధానం నెక్ట్స్ లెవల్లో ఉంది. కేరళలోని హిల్ స్టేషన్ల అందాలు, ఆనందాల నేపథ్యానికి వ్యతిరేకంగా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి షాక్ ఇవ్వడం. ఆ బ్యాక్ డ్రాప్ చూస్తే ఇక్కడ ఇలాంటి క్రూరత్వం కామన్ అనిపిస్తుంది. దాదాపు 114 నిమిషాల రన్‌టైమ్ లోనూ ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా సినిమాలో ఏమి చెప్పాలనుకుంటుందో దానిపై చాలావరకూ దృష్టి కేంద్రీకరించేలా సీన్స్ రాసుకుని, తీసారు.
స్క్రీన్‌ప్లేలో ఎక్కువ భాగం క్లబ్, అక్కడుండే పాత్రల తప్ప వేరేవి కనపడవు. వినపడవు. రెండు గ్యాంగ్‌ల మధ్య ప్రీ-క్లైమాక్స్ ముఖాముఖీ చాలా స్మూత్ గా డీల్ చేసారు. అలాగే సినిమా కెమెరా ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఎట్రాక్టివ్ గా అనిపించినా, ఎక్కడో ఒక చోట, ఆ వావ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉండాల్సింది. అదే మిస్సైంది. క్లైమాక్స్ లో కేవలం కాల్చుకోవటమే కాకుండా అంతకు మించి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. ఈ సినిమాలో పాత్రలు ఎవరు, వారు ఒకరికొకరు ఎలా ఉంటారు.
వాళ్లు ఏ విషయంలో అయినా వాళ్లు ఎంతవరకు వెళ్ళగలరు అనేది చూపెట్టడంలోనే ఎక్కువ శాతం సమయం గడిపారు. అలాగే సినిమా మిడిల్ కు వచ్చేసరికి , రైఫిల్ క్లబ్‌లో జరిగే సంఘటనలు,. అసలు వేట మధ్య సమాంతరాలను గీయడానికి స్క్రిప్ట్ ప్రయత్నిస్తున్నట్లు మనం గమనించవచ్చు. సినిమా లాస్ట్ యాక్ట్ లో కొన్ని భాగాలను నిజంగా ఎలివేట్ చేసే అనేక విషయాలను స్క్రిప్ట్ చక్కగా సూచిస్తుంది. అంతాబాగానే ఉంది కానీ యాక్షన్ థ్రిల్లర్ పైన చెప్పుకున్నట్లు ఎక్కడా అబ్బురపరచదు. వావ్ అనిపించదు.
ఎవరెలా చేసారు,టెక్నికల్ గా
ఈ సినిమాలో వాణి విశ్వనాథ్ ఆటిట్యూడ్, దిలీష్ పోతన్ క్యారెక్టర్ మనకు సినిమా పూర్తైనా గుర్తుంటాయి. అనురాగ్ కశ్యప్ విలనిజం కూడా సినిమా హైలెట్స్ లో ఒకటి. అలాగే సుప్రీం సుందర్ డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్, ఆషిక్ అబు సినిమాటోగ్రఫీ & సీన్ కంపోజిషన్ టెక్నిక్స్, “రైఫిల్ క్లబ్”ను 2024లో బెస్ట్ మలయాళం సినిమాల లిస్ట్ లో చేర్చాయి.
దర్సకుడు ఆశిక్ అబు కొత్త తరహా చిత్రాన్ని తక్కువ బడ్జెట్ ,లొకేషన్స్ లో చూపించాలనుకున్నాడు. తనదైన టెక్నికల్ వాల్యూస్ తో రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్‌లకు కాస్త భిన్నంగా ఆశిక్ అబు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. వెస్ట్రన్ స్టైల్‌లో తీర్చిదిద్దిన నేపథ్యం బాగా కలిసొచ్చింది.
చూడచ్చా
పూర్తి యాక్షన్ చిత్రం చూడాలనుకునేవాళ్లు, గన్‌ఫైరింగ్ ఎపిసోడ్స్ నచ్చేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతావాళ్లకు ఇదొక బోర్ క్లబ్ గా అనిపిస్తుంది.
ఎక్కడుంది.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమ్ అవుతోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
read more: `ఆదిత్య 369` షూటింగ్ నడుము విరగొట్టుకున్న బాలయ్య, కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
also read: సైఫ్ AI ఫొటోలు షేర్ చేసి ఇరుక్కున్న శతృఘ్న సిన్హా