టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే అదృష్టం కలిసి వచ్చింది రంభకు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తూ వచ్చింది. సినిమాల్లోకి వచ్చిరాగానే మెగాస్టార్ చిరంజీవి ,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల సరసన కూడా నటించి మెప్పించింది రంభ. చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ నుపొందింది.