టీఎన్‌ఆర్‌ పారితోషికం మామూలుగా లేదుగా.. చివరి వీడియో వైరల్‌

First Published May 10, 2021, 7:09 PM IST

ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్‌,నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహారెడ్డి) `ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌` షోతో పాపులరైన విషయం తెలిసిందే. ఇందులో ఆయన ఒక్క ఇంటర్వ్యూకి ఎంత తీసుకుంటాడనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్, నటుడ టీఎన్‌ఆర్‌ సోమవారం ఉదయం కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ, మీడియా షాక్‌కి గురైంది. తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. అనేక మంది సినీ స్టార్స్ ఆయన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.
undefined
`ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌` షోతో పాపులర్‌ అయ్యారు టీఎన్‌ఆర్‌. సెలబ్రిటీలను సూటిగా, సుత్తిలేకుండా ప్రశ్నలడుగుతూ, వారి నుంచి అనేక కొత్త విషయాలను, ఆసక్తికర విషయాలను బయటకు లాగడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే రామ్‌గోపాల్‌ వర్మ, దర్శకుడు తేజ వంటి ఇంటర్వ్యూలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని బోల్డ్ ఇంటర్వ్యూలు ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
undefined
పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన ఆయన ఆలీ నటించిన `పిట్టల దొర` సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్‌ వైపు వచ్చారు. మొదట్లో జర్నలిజం బ్యాగ్రౌండ్‌తో పలు క్రైమ్ షోలను కూడా డైరెక్ట్ చేసిన ఆయన ఎన్టీవీలో క్రైమ్ స్టోరీస్ వంటి ఎపిసోడ్స్‌న డైరెక్ట్ చేశారు. అలా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి `జార్జిరెడ్డి`, `నేనే రాజు నేనే మంత్రి`, `హిట్`, `జాతిరత్నాలు` వంటి సినిమాల్లో కూడా నటించారు. అలా జర్నలిస్ట్ లో సెలబ్రిటీ హోదాని పొందారు.
undefined
ఇక యాంకర్‌గా ఆయన కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో నాలుగు గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను చాటుకున్నారు. మరి ఇంటర్వ్యూలకు ఆయన ఎంత తీసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన షో నిడివిని బట్టి ఇంటర్య్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి ఆపైనే పారితోషికం తీసుకుంటారని సమాచారం. టాప్‌ యాంకర్ల రేంజ్‌ పారితోషికం ఆయన అందుకున్నారని చెప్పొచ్చు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
undefined
గంటల తరబడి సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలు వేస్తూ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్‌ని కూడా సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా టీఎన్ఆర్‌ చివరి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
undefined
`హాయ్ అండీ.. నేను మీ టిఎన్ఆర్.. కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్నాను.. బయటికి ఎక్కడికి వెళ్లడం లేదు.. కరోనా వచ్చినా కూడా భయపడకండి.. టెన్షన్ పడొద్దు.. కంగారు పడితే అదే సగం చంపేస్తుంది అంటూ అందరికీ ధైర్యం చెప్పాడు టిఎన్ఆర్. కావాలంటే మీ ఇంట్లో పిల్లలకు శిక్షణ ఇవ్వండి.. జీవితంలో సొంతంగా ఎలా ఎదగాలో చెప్పండి` అంటూ చెప్పారు. ఇప్పుడు ఆయన అదే కరోనాకి బలవడం అత్యంత బాధాకరం.
undefined
click me!