మూడు పెళ్లిళ్లు... పవన్ షాకింగ్ ఆన్సర్... బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్!

First Published Dec 28, 2022, 7:39 AM IST


బాలయ్య షోకి పవన్ గెస్ట్ గా రావడం ఊహించని పరిణామమే. ఇక బోల్డ్ షోగా పేరున్న అన్ స్టాపబుల్ లో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. 
 

Pawan Kalyan

అటు రాజకీయాలు ఇటు సినిమాలు... క్షణం తీరికలేని పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోకి కొంత సమయం కేటాయించారు. ఆయన ఈ టాక్ షో కొన్ని గంటల పాటు బాలయ్యతో ముచ్చటించనున్నారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ ముగియగా ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.

Pawan Kalyan and Anna Lezhneva

అన్ స్టాపబుల్(Unstoppable) షో వేదికగా బాలకృష్ణ-పవన్ మధ్య ఏపీ రాజకీయాలు, సినిమాలు, వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చాయట. ఊహించిన విధంగానే పవన్ కళ్యాణ్ ని బాలయ్య మూడు పెళ్లిళ్ల  గురించి అడిగారట. ప్రత్యర్థులు మీ వివాహాల పై విమర్శలు సంధిస్తూ ఉంటారు. అసలు మూడు వివాహాలు ఎందుకు చేసుకున్నారు? కారణం ఏమిటని? బాలయ్య అడిగారట...

Pawan Kalyan-Renu Desai

ఈ ప్రశ్నకు గతంలో మాదిరే కొంచెం ఆవేశంగానే పవన్ సమాధానం చెప్పినట్లు సమాచారం. నేను సరదాగా, కావాలని మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. నాకు సెట్ కాలేదు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తినప్పుడు చట్టపరంగా విడాకులు తీసుకొని మరొక వివాహం చేసుకోవడం జరిగిందని ఆయన సమాధానం చెప్పారట. 
 

Pawan Kalyan


ఇక పవన్ కి బాలకృష్ణ(Balakrishna) మద్దతుగా నిలిచారని సమాచారం. మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసేవారికి బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట. వ్యక్తిగత దాడి ఎదుటివారిని ఎంతగా బాధపెడుతుందో తెలియని వారు ఇలాంటి కామెంట్స్ చేస్తారు. ఈ  విమర్శలు చేసేవాళ్ళు మొదట తమ కుటుంబాల గురించి సమీక్షించుకోవాలని బాలయ్య అన్నట్లు సమాచారం.

Pawan Kalyan


పవన్(Pawan Kalyan)-బాలయ్య షోకి హాజరైన ఆడియన్స్ ఈ విషయాలు వెల్లడించారు. త్వరలో ప్రసారం కానున్న పవన్ ఎపిసోడ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పై ఉన్న పుకార్లకు ఈ షో వేదికగా ఆయన సమాధానం చెప్పే ఆస్కారం కలదు. 

Pawan Kalyan


రాజకీయ ప్రత్యర్ధులు పవన్ ని ప్యాకేజీ స్టార్ అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకు అనుకూలంగా రాజకీయాలు చేస్తాడనే అపవాదు ఉంది. దీని గురించి కూడా బాలయ్య పవన్ ని అడిగే ఆస్కారం కలదు. బావ చంద్రబాబునే వెన్నుపోటు అంశం గురించి అడిగిన బాలయ్య, పవన్ ని ప్యాకేజీ మేటర్ అడుగుతాడు అనడంలో సందేహం లేదు. 

అయితే వివాదాన్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళ ఇమేజ్ పెంచేలా స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. ఆగస్టు సంక్షోభం బాబుకు అనుకూలంగా మార్చిన బాలయ్య... తండ్రి ఎన్టీఆర్ తప్పుదోవ పట్టడం వలనే తామంతా కలిసి ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. ప్రజల కోసం చంద్రబాబు నిర్వహించిన కర్తవ్యంగా అభివర్ణించారు.

ఈ క్రమంలో 2014లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు తెలపడాన్ని ప్రజా శ్రేయస్సు కోసం ఆ రెండు పార్టీలు తీసుకున్న గొప్ప నిర్ణయంగా జనాలకు చేప్పే సూచనలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలయిక అనివార్యం అని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పవన్-బాలయ్యల కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ షో వేదికగా టీడీపీతో కావడం తప్పేమీ కాదని జనసేన వర్గాల్లో బీజాలు వేసే ప్రయత్నం జరగవచ్చు.

click me!