కమల్ హాసన్ తో ఎఫైర్, భర్త వేధింపులు, ఆస్తి పేదలకు దానం చేసి మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Mar 01, 2025, 12:26 PM IST

కమల్ హాసన్ ను ప్రేమించింది, పెళ్లి చేసుకోలేకపోయింది, భర్త వేదింపులను భరించింది. కోట్ల ఆస్తిని పోగొట్టుకుంది. చివరకు చిన్న వయస్సులోనే మరణించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?   

PREV
16
కమల్ హాసన్ తో ఎఫైర్, భర్త వేధింపులు, ఆస్తి పేదలకు దానం చేసి మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

వెండితెరపై  వెలిగిన హీరోయిన్ల నవ్వుల వెనుక ఎంతో మంది విషాద గాదలు ఉన్నాయి. రాజభోగాలు అనుభవించి, చివరకు మోసపోయి ఇబ్బందులుపడ్డ హీరోయిన్లు ఎందరో ఉన్నారు.  అలాంటివారిలో శ్రీదివ్వ కూడా ఒకరు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ వరుస సినిమాలు చేసిన శ్రీవిద్య.. ఆతరువాత హీరోయిన్ గా కెరీర్ కు స్వస్తి చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. హీరోలు, హీరోయిన్ల తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయ్యారు.

Also Read: 21 కోట్ల చెవి దుద్దులు, 700 కోట్ల ఆస్తులు, 4 ఏళ్లు మూవీస్ లేకున్నా మహారాణిలా లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ?

26
Srividya

 తన కంటే పెద్దవారైన హీరోలకు కూడా ఆమె తల్లి పాత్రలు చేశారు. ఇక శ్రీవిద్య కెరీర్ లో అనుభవించిన కష్టాలు, పెట్టిన కన్నీళ్ల గురించి తెలిసిన వారి కళ్లు చెమ్మగిల్లక మానవు.  హీరోయిన్ గా  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలిన శ్రీవిద్య.. అంతులేని కన్నీటి అగాథంలో చిక్కుకుని విలవిలలాడింది. ప్రియుడికోసం మతం  మార్చుకుని మరీ పెళ్ళి చేసుకుని.. మళ్లీ ఆ బలైంది శ్రీవిద్య. 

Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?

36
Kamal and Srividya

కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకాంత్, కమల్ హాసన్ తో కలిసి నటించిన శ్రీవిద్య, కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు చేసేసరికి వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారట. అయితే శ్రీవిద్య తల్లి ఈ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో.. వీరి ప్రేమ పెళ్ళి పీటలదాక రాలేదు. అదే సమయంలో  శ్రీవిద్య 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ని పెళ్లాడింది. 

Also Read: ఎన్టీఆర్ , కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?

46

అయితే వైవాహిక జీవితం ఈమెకు నరకంగానే మారిందని చెప్పాలి. పెళ్ళి తరువాత భర్త చెప్పడంతో సినిమాలు మానేయాల్సి వచ్చింది శ్రీవిద్య.ఆమె ఆస్తి మొత్తం కూడా భర్త దక్కించుకన్నాడు. ఆతరువాత నుంచి ఆమెను హింసించడం స్టార్ట్ చేశారు. ఇక  మనస్పర్థలు పెరగడంతో వీరు  1980లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తరువాత శ్రీవిద్యకు ఆర్థిక సమస్యలు ప్రారంభం కావడంతో మరోసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది స్టార్ నటి. 

Also Read: బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?

56

కాని ఈసారి హీరోయిన్ గా కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జీవితం కొత్తగా స్టార్ట్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేసింది శ్రీవిద్య. బాగా సంపాదించి హ్యాపీగా ఉంది అనుకున్న టైమ్ లో ఆమె జీవితం మళ్లీ విషాదమయం అయ్యింది.  శ్రీవిద్య  ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. 

Also Read: చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ ఎవరో తెలుసా? చిరు మెగా హీరో ఎలా అయ్యారు?

66

క్యాన్సర్ బారిన పడిన శ్రీవిద్య  2003లో తన ఆస్తి మొత్తాన్ని  సంగీత, నృత్య కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు విరాళంగా ప్రకటించింది. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్టార్ నటీనటులతో విరాళాలు సేకరించి పేద విద్యార్థులకు అందించింది. క్యాన్సర్ కారణంగా 2006లో 53 ఏళ్ల వయసులో శ్రీవిద్య కన్నుమూసింది. 

Also Read: నాని నాగచైతన్య కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్? చేయకపోవడమే మంచిదయ్యిందా?

Read more Photos on
click me!

Recommended Stories