నయనతార, రష్మిక, అనుష్క, త్రిషలకు సాయిపల్లవి ఝలక్‌, `రామాయణ్‌`కి ఆమె తీసుకునే పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్

Published : Mar 01, 2025, 11:26 AM IST

ఇటీవల `అమరన్‌`, `తండేల్‌` చిత్రాలతో విజయాలు అందుకున్న సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ్‌` మూవీ చేస్తుంది. దీనికి ఆమె పారితోషికం లెక్కలు షాకిస్తున్నాయి.   

PREV
16
నయనతార, రష్మిక, అనుష్క, త్రిషలకు సాయిపల్లవి  ఝలక్‌, `రామాయణ్‌`కి ఆమె తీసుకునే పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్
sai Pallavi nayanthara rashmika Anushka trisha remuneration

హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో నయనతార, రష్మిక మందన్నా, అనుష్క శెట్టిలతోపాటు త్రిష కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీరికి పెద్ద షాకిస్తుంది లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి. ఆమె లేటెస్ట్ పారితోషికం తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. సడెన్‌గా టాప్‌లోకి దూసుకొచ్చి అందరికి ఝలక్‌ ఇస్తుంది. మరి ఆ కథేంటో చూద్దాం. 
 

26
nayanthara

ప్రస్తుతం పారితోషికంలో నయనతార టాప్‌లో ఉన్నారు. ఆమె ఒక్కో సినిమాకి పది కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న ఆమె చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తుంది.

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో రాణిస్తుంది. హీరోలకు దీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి. అదే సమయంలో భారీ సినిమాల్లో స్టార్‌ హీరోల సరసన బలమైన పాత్రలతోమెప్పిస్తుంది. అందుకే ఆమె భారీ పారితోషికం ఇస్తున్నారు. 

36
Rashmika Mandanna

ఇప్పుడు ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది రష్మిక మందన్నా. ఆమె `పుష్ప 2` సినిమాకి పది కోట్ల వరకు పారితోషికం అందుకుందట. కానీ `ఛావా` మూవీకి మాత్రం ఐదుకోట్లే తీసుకుందని సమాచారం. కానీ ఈ సినిమా కూడా ఇప్పుడు భారీ విజయాన్ని సాధించింది. ఐదు వందల కోట్ల దిశగా వెళ్తుంది. త్వరలోనే తెలుగులో కూడా రాబోతుంది. దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. 

46
anushka shetty

ఈ జాబితాలో స్వీటి అనుష్క శెట్టి కూడా ఉంది. ఆమె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం నటిస్తున్న `ఘాటి` మూవీకి అనుష్క రూ.ఏడు నుంచి 10కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని తెలుస్తుంది. 

56
trisha

త్రిష ఇప్పుడు సౌత్‌లో బిజీగా ఉంది. సీనియర్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. విజయ్‌, అజిత్‌, చిరంజీవి వంటి సూపర్‌ స్టార్స్ తో ఆమె జోడీ కడుతుంది. ఆమె కూడా గట్టిగానే తీసుకుంటుందట. ఒక్కో మూవీకి సుమారు రూ.10కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని తెలుస్తుంది. 
 

66
Sai Pallavi

ఇక వీరందరికి ఊహించని షాక్‌ ఇస్తుంది సాయిపల్లవి. ఆమె పారితోషికాన్ని సడెన్‌గా డబుల్‌, త్రిబుల్‌ చేసింది. `తండేల్‌` మూవీకి ఐదు కోట్ల వరకు తీసుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ్‌` మూవీలో నటిస్తుంది.

ఇందులో రణ్‌బీర్ కపూర్‌ రాముడీగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా కనిపించబోతుంది. యష్‌ రావణుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకి గానూ సాయిపల్లవి ఏకంగా రూ.15కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. అయితే ఇది రెండు పార్ట్ లుగా వస్తుందని సమాచారం. 

read  more: పవన్‌ కళ్యాణ్‌ మిస్‌ చేసుకున్న కథతో మహేష్‌ బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన మూవీ ఏంటో తెలుసా?, మల్టీస్టారర్‌లో బెస్ట్

also read: నాగార్జున అర్థరాత్రి బెడ్‌పై ఉన్నా సరే ఫోన్‌ చేసే ఒకే ఒక్క హీరోయిన్‌ ఎవరో తెలుసా? అమలకు తెలిసే అదంతా!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories