షాకింగ్ : హీరోగా రానా ఫస్ట్ సినిమాకి ఆ డైరక్టర్ ని ఓకే చేసి, కాన్సిల్ చేసారా?

Published : Mar 01, 2025, 10:40 AM ISTUpdated : Mar 01, 2025, 10:44 AM IST

Rana daggubati : రానా దగ్గుబాటి హీరోగా తొలి సినిమా లీడర్ కన్నా ముందు వేరే దర్శకులతో డిస్కషన్స్ జరిగాయి. అయితే అవి మెటీరియలైజ్ కాలేదు. అందుకు కారణం ఏమిటి..ఏ డైరక్టర్ తో మొదట రానా సినిమా చెయ్యాలనుకున్నారు  

PREV
14
 షాకింగ్ : హీరోగా రానా ఫస్ట్  సినిమాకి  ఆ డైరక్టర్ ని ఓకే చేసి, కాన్సిల్ చేసారా?
Is Rana daggubati want work with Raghavendra Rao son?

Rana daggubati : రానా తొలి చిత్రం ‘లీడర్’. అందులో యంగ్ సీఎం గా  రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు ఆయన. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్నంలో వచ్చిన  ‘బాహుబలి’లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

తర్వాత  తమిళంలో ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో నటిస్తే మంచి పేరు వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి, విరాటపర్వం ఇలా రానా నటనా ప్రస్ధానం కొనసాగుతోంది. ఇప్పుడు  రానా చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. అయితే రానా హీరోగా లాంచ్ అవ్వాల్సింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాదట. వేరే డైరక్టర్ తో ప్లాన్ చేసారట. ఎవరా డైరక్టర్
 

24
Is Rana daggubati want work with Raghavendra Rao son?


అవి  శతచిత్ర నిర్మాత డి. రామానాయుడు మనుమడు, సురేష్ కుమారుడు అయిన 'రానా' హీరోగా పరిచయం కానున్నాడని వార్తలు వస్తున్న రోజులు .  అప్పటికి  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు సూర్యప్రకాష్ దర్శకత్వంలో సినిమాలు నిర్మిస్తున్నాడు రానా.

అప్పటికే హీరోగా పరిచయం అయిన సూర్యప్రకాష్ మాత్రం ఇకపై దర్శకుడిగానే కొనసాగుతాడని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో నిర్మించిన 'బొమ్మలాట' జాతీయ అవార్డును గెలుచుకోవడంతో ఇది హిట్ కాంబి నేషన్ గా  పేరు పడిపోయింది. 

34
Is Rana daggubati want work with Raghavendra Rao son?


దాంతో రానా ని హీరోగా లాంచ్ చేయటానికి సూర్య ప్రకాష్ ని సరైన వాడు అనుకున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయట. కథ కూడా విని ఓకే చేసారట. అయితే ఆ కథ కొంచెం ఆర్ట్ సినిమా తరహాలో ఉంటుందిట.

దాంతో  రానా తండ్రి  సురేష్ బాబు తన కొడుకుని కమర్షయల్ హీరోగా లాంచ్ చేయాలనుకుంటున్నానని చెప్పి శేఖర్ కమ్ముల చేతిలో పెట్టారట. అలా సూర్య  ప్రకాష్ దర్శకత్వంలో రానా హీరోగా సినిమా లాంచ్ అయ్యే అవకాశం మిస్సైందిట. 
 

44
Is Rana daggubati want work with Raghavendra Rao son?

 ‘లీడర్’కి కొనసాగింపుగా ‘లీడర్ 2’ చేయాలనుకుంటున్నారు రానా. ఈ విషయాన్ని ఆయన అప్పట్లో ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని రానా తెలిపారు. మరి.. తొలి భాగానికి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ములే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
 

Read more Photos on
click me!

Recommended Stories