కురచ దుస్తుల్లో తలక్రిందులుగా శ్రీదేవి తనయ జాన్వీ వ్యాయామ భంగిమలు, చూసే వారికి కూడా చెమటలు పట్టేలా!

First Published Sep 18, 2021, 1:24 PM IST


సహజంగా సంక్రమించిన అందానికి జిమ్ లో సానబెట్టి మెరుగు దిద్దుతుంది స్టార్ కిడ్ జాన్వీ కపూర్. ఈ అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ ఫిట్నెస్ ఫ్రీక్ కాగా, వ్యాయామం దిన చర్యలో భాగంగా ఉంది. 

ప్రతి రోజూ రెండు పూటలా ఎక్స్ పర్ట్స్ ఫిట్నెస్ ట్రైనెర్స్ పర్యవేక్షణలో ఆమె గంటల తరబడి వ్యాయామం చేస్తారు. అవసరమైన శరీర ఆకృతి కోసం చెమటలు చిందిస్తారు . 

శరీరాన్ని గట్టిగా హత్తుకున్నట్లు ఉండే జిమ్ వేర్ లో తరచుగా పబ్లిక్ లో జాన్వీ రచ్చ చేస్తూ ఉంటారు. మరీ కురచ దుస్తుల్లో బహిరంగంగా తిరిగే జాన్వీని కెమెరాలో బంధించడానికి, కెమెరా మెన్స్ సిద్ధంగా ఉంటారు. 
 


తాజాగా జాన్వీ కపూర్ జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు . పొట్టివైన జిమ్ వేర్ లో తలక్రిందులుగా ఆసనాలు వేస్తూ... సొగసైన థైస్ చూపిస్తూ హాట్ హాట్ గా దర్శనం ఇచ్చింది. 


చాలీచాలని కురచ దుస్తుల్లో జాన్వీ వ్యాయామ భంగిమలు, చూస్తున్న కుర్రకారుకు కూడా చెమటలు పట్టిస్తున్నాయి. జాన్వీ జిమ్ ఫోటోలు క్షణాల్లో వైరల్ కాగా, లక్షల్లో లైక్స్ వచ్చి చేరుతున్నాయి. 


ఇక జాన్వీ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం భారీగా సంపాదించారు. 2018లో విడుదలైన దఢక్ జాన్వీ మొదటి చిత్రం. ఆ చిత్రం విడుదల కాకుండానే శ్రీదేవి హఠాన్మరణం పొందారు. 
 


 జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.  2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి. 

ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. 
 

click me!