ఈ సినిమా టైటిల్ ను కృష్ణ ముందే రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ ను మార్చడానికి నిర్మాత శేఖర్ బాబు ఒప్పుకోలేదు. అటు బాలయ్య కోసం పెద్దాయన ఎన్టీఆర్ రంగంలోకిదిగగా.. ఇటు రమేష్ బాబు తరపున కృష్ణ ముందు నుంచే రంగంలో ఉన్నాడు. ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాట్ టైటిల్ బాలయ్య సినిమాకే పెట్టాలని పంతం పట్టారు. సామ్రాట్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసి.. రిలీజ్ కు కూడా రెడీ అయ్యారు. రెండు సినిమాలు సామ్రాట్ అనే టైటిల్ తో ప్రమోషన్స్ కూడా చేశారు.