Ram Charan: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తెలుగు హీరో రామ్ చరణ్‌తో సినిమా తీయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇద్దరికీ పరస్పర అవసరాలు ఉండటంతో ఈ కలయికకు అవకాశం ఉంది. కరణ్ జోహార్ రామ్ చరణ్‌తో భారీ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ram Charan: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరక్టర్, డిస్ట్రిబ్యూటర్ అయిన కరణ్ జోహార్ తెలుగు సినీ ప్రియులకు సుపరిచితులే. ఆయన ఇక్కడ బాహుబలి వంటి పెద్ద సినిమాలను అక్కడ సక్సెస్ ఫుల్ గా మార్కెట్ చేసారు. అలగే ఆయన దృష్టి మన తెలుగు హీరోలపై పడింది.
ఆ క్రమంలోనే కొంతకాలం క్రితం.. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కరణ్ జోహర్ ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో నిజమెంత
24
Ram Charan next movie with Karan johar? in telugu
బాలీవుడ్ లో పరిస్దితులు బాగోలేదు. హిందీ మార్కెట్ లో రెమ్యూనిరేషన్లు, కలెక్షన్లు మ్యాచ్ కావడం లేదు. కోట్లకు కోట్ల రెమ్యూనిరేషన్లు ఇచ్చి సినిమాలు చేస్తున్నా రికవరీలు ఉండటం లేదని అందుకే కరణ్ జోహార్ ఇక్కడ దృష్టి పెట్టాడంటున్నారు.
అదే సమయంలో మరోపక్క తెలుగు సినిమాల బడ్జెట్ , బిజినెస్ మతిపోయేలా చేస్తోంది. అందుకే అక్కడ నిర్మాతలు ఇక్కడ సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు. కరుణ్ జోహార్ వస్తే మరికొంతమంది వచ్చే అవకాసం ఉందంటున్నారు. అందులో భాగంగానే రామ్ చరణ్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారట. అయితే రామ్ చరణ్ కు కరణ్ జోహార్ తో అవసరాలేంటి
34
Ram Charan next movie with Karan johar? in telugu
రామ్ చరణ్ తన రాబోయే సినిమాల ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. తనకు ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన మార్కెట్ ని మరింత విస్తరించాలనుకుంటున్నారు. అందుకు బాలీవుడ్ లో మకుటం లేని మహారాజా లాంటి కరణ్ జోహార్ తో బిజినెస్ అవసరమే అన్నది నిజం.
దాంతో ఇద్దరికీ ఒకరి అవసరాలు మరికొరకు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ వరస ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. దాంతో ఈ లోగా తెలుగు మార్కెట్ పై పట్టుకోసం చరణ్‌తో పాటు మరో రెండు, మూడు మిడ్-రేంజ్ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
44
Ram Charan next movie with Karan johar? in telugu
నిర్మాత గా కరణ్ జోహార్, రామ్ చరణ్‌తో వరస పెట్టి మూడు భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే డేట్స్ దొరుకుతాయా, ఎలా ముందుకు వెళ్లాలి, ఏ డైరక్టర్స్ ని సెట్ చేయాలి వంటి విషయాలపై డిస్కషన్స్ జరుగుతున్నట్లు బాలీవుడ్ నుంచి వార్తలు వస్తున్నాయి.
కరణ్ నిర్మించిన కిల్ మూవీ హిట్ కావడంతో, నగేష్ భట్‌ను దర్శకత్వ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ ఎక్సపెక్టేషన్స్ తో రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర టీమ్ త్వరలో ఢిల్లీ, కాకినాడ లొకేషన్లలో షూటింగ్ జరపనుంది. అయితే, ఇప్పుడు