Tamannah bhatia : పుడుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ మోసంలో సినీ తారలు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను విచారించనున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై తమన్నా స్పందిస్తూ తన ప్రమేయం లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.
Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu
Tamannah bhatia : పుడుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే . క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ. 2.40కోట్లు వసూలు చేశారు. అయితే ఆఖరకు ఏమీ చెల్లించకుండా చేతులెత్తేశారు.
దీనిపై ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోకన్.. కంపెనీ తమను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పుడుచ్చేరి పోలీసులు.. సినీతారలు తమన్నా, కాజల్ అగర్వాల్ లను విచారించాలని నిర్ణయించారని నిన్నంతా వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయమై తన ప్రమేయం ఏమీ లేదని తమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
23
Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu
తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా.
అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్ పనిచేస్తుంది' అని తెలిపింది.కాగా.. క్రిప్టో కరెన్సీ ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ.కోట్లలో మోసానికి పాల్పడిన కేసులో సినీతారలు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను విచారించేందుకు పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసులు సమన్లు పంపారని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి.
33
Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu
పుదుచ్చేరి లాస్‌పేట్టైకు చెందిన విశ్రాంత ఉద్యోగి అశోకన్(70) క్రిప్టో కరెన్సీలో ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ.98లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఆయన ఫిర్యాదు మేరకు పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి క్రిప్టో కరెన్సీ మోసం ముఠాలోని కోవైకు చెందిన నితీష్‌కుమార్ జెయిన్ (36), అరవింద్‌కుమాôర్(40)ని అరెస్ట్ చేశారు.
క్రిప్టో కరెన్సీ మోసం కేసుతో సంబంధం ఉన్నవారు కోవై, మహాబలిపురం, ముంభై తదితరచోట్ల భారీ ఖర్చుతో పార్టీలు నిర్వహించారు. ఇందులో సినీతారలు తమన్నా, కాజల్ తదితర ప్రముఖులు పాల్గొన్నట్లు తెలిసింది. ఇందుకోసం వారికి ఎంత పారితోషికం ఇచ్చారు, ఆ నగదు ఏ బ్యాంకు ఖాతా ద్వారా పంపారు, ఆ ముఠాతో సంబంధాలున్నాయా అన్న కోణంలో తమన్నా, కాజల్‌ను విచారించేందుకు పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసులు సమన్లు పంపించారని చెప్తున్నారు.