యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) కోలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, నటనతో అక్కడి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకొని వెండితెరపై సందడి చేసింది.
తమిళంతోనే కాకుండా కన్నడ,మలయాళం చిత్రాల్లోనూ నటించింది. ఇప్పటికీ ఆఫర్లు అందుకుంటోంది. ఇక తెలుగులోకి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు రెండు చిత్రాల్లో నటించింది.
రీసెంట్ గా విడుదలైన ‘సై’తో ఈ ముద్దుగుమ్మ ఇక్కడ పాపులర్ అయ్యింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన ఐశ్వర్య మీనన్ నటించింది. నటనపరంగా ఆకట్టుకుంది. యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టింది. ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
ఇక కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఫెయిల్యూర్’ అనే చిత్రంలో మొదటి నటించింది. ఈ చిత్రం 2012లోనే వచ్చింది. అంటే పదేళ్ల కిందనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. స్పైతో ఆ పని పూర్తైంది.
ఈ క్రమంలో టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ అందుకున్నట్టు సమచారం. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మ పంట పండినట్టే అంటున్నారు.
ఇదిలా ఉంటే ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో అందాల దుమారం తెప్పిస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మినీ పింక్ డ్రెస్ లో పరువాల ప్రదర్శన చేసింది. ఏకంగా బ్రా, థైస్ అందాలను చూపిస్తూ మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.