ఎస్పీ బాలు, జయప్రకాశ్ రెడ్డి, నర్సింగ్... చీకటి ఏడాది 2020లో కనుమరుగైన తారలు వీరే!

First Published Mar 16, 2021, 1:11 PM IST

2020 ప్రపంచానికి ఓ చీకటి అధ్యాయంగా మిలిగిపోతుంది. గత వందేళ్లలో ఎన్నడూ ఎరుగని భయానక పరిస్థితులను పరిచయం చేసింది ఈ సంవత్సరం. దేశానికి మరో దేశాన్ని, ప్రాంతానికి మరో ప్రాంతాన్ని.. చివరికి మనిషికి మరో మనిషిని దూరం చేసిన కరోనా అనే మహమ్మారి, విళయతాండవం చేసిన ఏడాదిగా 2020 మిగిలిపోయింది. ఏళ్లుగా వెండితెరపై వినోదం పంచుతున్న కొందరు తారలు కూడా 2020 సంవత్సరంలో కన్నుమూసి సుదూర తీరాలకు చేరుకున్నారు. ఎస్పీ బాలు, జయప్రకాష్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రావి కొండలరావు వంటి నటులు, కళాకారులు 2020లో కన్నుమూశారు. మరి గత ఏడాది నింగికి ఎగిసిన తారలు ఎవరో తెలిస్తే కన్నీళ్లు ఆగవు... 
 

పాటకు చిరునామాగా బ్రతికారు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం. దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో 70వేలకు పైగా పాటలు పాడిన సంగీత దిగ్గజం బాలు  గొంతు 2020 సెప్టెంబర్ 25న మూగబోయింది. కరోనా సోకడంతో చెన్నై ఎంజీఆర్ హాస్పిటల్స్ లో బాలు అడ్మిట్ అయ్యారు. దాదాపు నెలరోజుల సుదీర్ఘ పోరాటం తరువాత బాలు తుదిశ్వాస విడిచారు.
undefined
సీనియర్ నటుడు రావి కొండలరావు 80-90లలో వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ప్రారంభించిన రావి కొండలరావు దర్శకుడిగా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఏళ్ల తరబడి చిత్ర పరిశ్రమకు సేవలు చేసిన రావి కొండలరావు జులై 28,2020న 88ఏళ్ల వయసులో కన్నుమూశారు.
undefined
హైదరాబాద్ కి చెందిన నటుడు నర్సింగ్ యాదవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. దశాబ్దాల పాటు నర్సింగ్ యాదవ్ వెండితెరపై వివిధ పాత్రలు చేశారు. మొదట్లో కేవలం సీరియస్ విలన్ రోల్స్ చేసిన ఆయన... ఆ తరువాత కామెడీ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేయడం జరిగింది. వందల చిత్రాలలో కనిపించిన నర్సింగ్ యాదవ్ అనారోగ్యం కారణంగా 2020 డిసెంబర్ 31న 57ఏళ్ల వయసులో మరణించారు.
undefined
రాయలసీమ యాసకు వెండితెర గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాశ్ రెడ్డి. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ పాత్ర అంటే మొదట గుర్తు వచ్చే పేరు జయప్రకాష్ రెడ్డి. ప్రేమించుకుందాం రా, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో తన విలనిజంతో సినిమా విజయంలో భాగమయ్యారు ఆయన. పచ్చి రక్తం తాగే విలన్ పాత్రలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ రోల్స్ కూడా ఆయన చేశారు. ఈ విలక్షణ నటుడు 2020 సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు.
undefined
టెలివిజన్ నటి శ్రావణి కొండపల్లి అతితక్కువ వయసులో లోకం విడిచిపోయారు. 2020 సెప్టెంబర్ 8న శ్రావణి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
undefined
మర్యాద రామన్న వంటి పలు హిట్ సినిమాలలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసూరి వేణుగోపాల రావు అనారోగ్యం కారణంగా 2020 సెప్టెంబర్ 23న మరణించడం జరిగింది.
undefined
నిర్మాతగా, నటుడిగా పలు చిన్న బడ్జెట్ చిత్రాలు చేశారు యాదా కృష్ణ. 61ఏళ్ల వయసులో యాదా కృష్ణ గుండెపోటుతో మరణించడం జరిగింది.
undefined
click me!