అంటే కల్పన ఎక్కువ నిద్రమాత్రలు వేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. అంతకుముందు ఆమె భర్త ప్రసాద్‌కు ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వారికి ఫోన్ ద్వారా తెలియజేశారు.
వెంటనే చుట్టుపక్కల వారు త్వరగా వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, కల్పన పడకగదిలో స్పృహ లేకుండా పడి ఉండటం చూశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
కల్పన తన కూతురు దయా ప్రసాద్‌తో చదువు విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కల్పన తన కూతురిని హైదరాబాద్‌లో చదివించాలని అనుకున్నారు. కానీ దయా దానికి నిరాకరించింది.
ఈ విషయమై మార్చి 3న తల్లికి, కూతురికి వాగ్వాదం జరిగింది. దీంతో మార్చి 4న ఎర్నాకులం నుంచి తిరిగి వచ్చిన కల్పన ఆ రాత్రి నిద్రలేక ఎక్కువ నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిసింది.
Also Read:4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?